సూపర్‌స్టార్‌ను అడుగుతున్న ఆది

30 ఏళ్ల కెరీర్‌లో 40 సినిమాలు తీసిన అగ్ర దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడు. హీరోగా తెలుగు సినిమాతో పరిచయమైనప్పటికీ, తమిళంలో విభిన్నమైన పాత్రల ద్వారా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో ప్రధాన భూమికలు పోషిస్తూ తన సత్తా చాటుకుంటున్నారు. ‘వైశాలి’ తమిళ అనువాదంతో ప్రేక్షకుల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు ఆది పినిశెట్టి.

ఓవైపు తమిళంలో హీరో పాత్రలు పోషిస్తూనే మరోవైపు తెలుగులో అందివచ్చిన పాత్రల్లో నటిస్తున్న నటుడు ఆది పినిశెట్టి. సరైనోడు, నిన్ను కోరి వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి రంగస్థలంతో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సమంతతో ‘యూటర్న్ లో నటించి దాని ప్రొమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు.

ఆ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు ఆది పినిశెట్టి. తెలుగులో తన ఫ్యావరెట్ నటుడు మహేష్ బాబు అని చెప్పారు. మహేష్ బాబు ఓ అమృతం. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన గ్లామర్ మాత్రం తగ్గడం లేదు. ఆ సీక్రెట్ ఏంటో మహేష్ చెబితే మేము కూడా ఫాలో అవుతాం. ఇక ఆయన నటన గురించి నేను కొత్తగా చెప్పడానికి ఏమిలేదు అని చెప్పారు ఆది.

ఒకవైపు తమిళంలో హీరోగా చేస్తూనే, తెలుగులో ప్రధాన పాత్రలు, నెగిటివ్‌ రోల్స్‌ చేయడం ద్వారా నటుడిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నా. మొదటి నుంచి నా కెరీర్‌ను గమనిస్తే హీరోనా, విలనా అనే తేడాలు నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఛాలెంజింగ్‌గా ఉన్న ఎలాంటి పాత్రనైనా చేసేందుకు సిద్ధపడ్డా. ఇక ముందు కూడా నా జర్నీ ఇలాగే కొనసాగుతుంది అని చెప్పారు ఆది.

యూటర్న్ సినిమాకు తాము పెద్దగా ప్రచారం చేయలేదని కానీ చూసి ప్రేక్షకులు మాత్రం థ్రిల్ ఫీలవుతున్నారని ఆ మౌత్ టాకే తమ సినిమాకు విజయాన్ని అందిస్తోందని ఆది చెప్పుకొచ్చారు. మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఎంట్రీ అద్భుతంగా ఉంటుందని పాత్ర సాగిన తీరును ఎంతో ఇష్టపడ్డానని వివరించారు.

పని పట్ల సూపర్ స్టార్ మహేష్ డెడికేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడ తగినంత సమయం కేటాయిస్తారు. పండగలు, పిల్లల పుట్టినరోజులు, హాలిడే ట్రిప్పులు అంటూ ఫ్యామిలీకి తగిన ప్రాముఖ్యత ఇస్తుంటారు. కానీ ఈసారి వినాయకచవితికి మాత్రం అది కుదరలేదు. వంశీ పైడిపల్లితో చేస్తున్న’మహర్షి’ చిత్రీకరణలో బిజీగా ఉండటం వలన వినాయకచవితికి హైదరాబాద్లోని ఇంటికి రాలేకపోయారు.

Share

Leave a Comment