సినిమాలను, ఎండోర్సమెంట్లను సమానంగా బ్యాలెన్స్ చేసుకోవడం సూపర్ స్టార్ స్పెషాలిటీ. మహేష్ మహర్షి షూటింగ్ కోసం క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు. ఇంత బిజీ లోనూ ఇటీవల మహేష్ అభి బస్ కు ఒక యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ యాడ్ వీడియో ని సదరు కంపెనీ వారు విడుదల చేసారు.
ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిలో మహేష్ బాబు తన చార్మ్ మరియు స్టైల్ తో అదరకొడుతున్నాడనే చెప్పాలి. కొత్త లుక్ లో సూపర్‌స్టార్ మునిపటి కంటే అందంగా కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు వీటిని షేర్ల మీద షేర్లు చేసేస్తున్నారు. ఈ యాడ్ ను రామోజీ ఫిలిం సిటీ లో తెరకెక్కించారు.
వెన్నెల కిషోర్ ఇందులో మహేష్ తో పాటు నటించాడు. మహేష్ – వెన్నెల కిషోర్ కాంబినేషన్ ఇప్పటికే అన్ని సినిమాల్లో హైలైట్ గా నిలించింది. వారిద్దరి కామిక్ టైమింగ్ అదుర్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ యాడ్ మరొకసారి వీరి కాంబినేషన్ ఎంత సరదాగా ఉంటుందో తెలియజేసింది.
నెవ్వర్ మిస్ ఎ ప్రెషియస్ మొమెంట్ అనే టైటిల్ తో ఈ యాడ్ ని విడుదల చేయడం జరిగింది. మహేష్ ని వెన్నెల కిషోర్ కావలని వేరే ఊరికి పంపాలని చూస్తాడు. తరువాత రోజు ఫంక్షన్లో మహేష్ ని చూసి వెన్నెల కిషోర్ షాక్ అవుతాడు. మహేష్ మీరు చెప్పినట్టే ఫ్లైట్ లో వచ్చేసా అని పంచ్ వేస్తాడు. మహేష్ – వెన్నెల కిషోర్ కాంబో మరోసారి ఆకట్టుకుందనే చెప్పాలి.
ఈ యాడ్ షూట్ ఒక ప్రత్యేకత ను కూడా సొంతం చేసుకుంది. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ విజయం తరువాత కొరటాల తో మహేష్ కలిసి పని చేసింది ఈ యాడ్ కోసమే. కెమెరా మ్యాన్ కూడా భరత్ అనే నేను కు పని చేసిన మాదీ నే. ఇక అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా భరత్ అనే నేను వాళ్ళే.
త్వరలో అమెరికా ప్రయాణం అవ్వనున్నారు మహర్షి చిత్రబృందం. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట. ఇందులో మహేష్ బాబు స్టూడెంట్‌గా నటిస్తున్నారని ‘మహర్షి’ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కానీ మహేష్ బాబు క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయని ఒక షేడ్‌లో స్టూడెంట్‌గా కనిపించే మహేష్ మరో షేడ్‌లో మరింత డిఫరెంట్ గా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది.