సూపర్‌స్టార్ గురించి తమన్నా

రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ సిరీస్ ఎంతటి సంచలనాలు సృష్టించిందనేది అందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి తీర్చిద్దిన ఈ సినిమా మూడో భాగం కూడా తీయాలని జనం డిమాండ్ చేస్తున్నారట. ‘బాహుబలి 3’ కూడా తీయండని జనం డిమాండ్ చేస్తారని అస్సలు ఉహించలేదని తమన్నా అంటోంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన తమన్నా ఈ విషయం తెలిపారు.

అలాగే చాలా విషయాలు మీడియా మిత్రులతో పంచుకున్నారు తమన్నా. ‘ మహేష్ నటన అంటే చాలా ఇష్టం. మహేష్‌కు జోడీగా నటించాలనేది నా కోరిక. ఒకసారి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. డేట్స్ సర్దుబాటు చేయలేక నేనే వదులుకున్నాను. అప్పుడు నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. తరువాత ‘ఆగడు’లో అవకాశం రావడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది.

మహేష్ గారితో నటించాలి అన్న నా కోరికను నెరవేర్చింది ఆ సినిమా. ఇప్పటివరకూ కనిపించనంత మహా మాస్‌గా ఆగడులో కనిపించాను. మహేష్ గారితో కలిసి యాక్ట్ చేయడం చాలా మెమొరీస్ ని ఇచ్చింది’ అన్నారు తమన్నా. మామూలు పాత్రలు చేయటం కంటే పీరియాడిక్ సినిమాల్లో నటించడమనేది విభిన్నంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

తమన్నా మహేష్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకోవడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు మునుపు కూడా అనేక సందర్భాల్లో మహేష్ నటన తనకి ఇష్టమని చెప్పారు. ఒకసరి అవార్డు ఫంక్షన్ లో తను పర్ఫార్మ్ చేస్తూ స్టేజ్ కిందకి వచ్చి మహేష్ తో సెల్ఫీ తీసుకుని ఆ పిక్ ని నెట్ లో పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

సాధారణంగా తాను పీరియాడిక్ సినిమాలకు సంతకం చేయనని, కానీ చిరంజీవి గారి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో నటించే అవకాశం రావటంతో కాదనలేక పోయానని చెప్పింది. పీరియాడిక్ చిత్రాల్లో నటించడం అనేది ఓ ఛాలెంజింగ్ లాంటిదని అభిప్రాయపడింది.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా షూటింగ్ లో మహేష్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ 2019 ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది.

Share

Leave a Comment