మ‌హేష్‌ గురించి ఆ విలన్‌ ఏమన్నారంటే

ఇటీవల కాలంలో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ విశేషంగా ఆకట్టుకొంటున్న వారిలో నటుడు అరుణ్‌ విజయ్‌ ఒకరు. అగ్ర కథానాయకులు తనకిచ్చిన సలహాలు, సూచనలు ఎప్పటికీ మర్చిపోలేనని అరుణ్‌ విజయ్‌ అన్నారు. ఆయన ‘ఎంతవాడు గాని..’, ‘బ్రూస్‌లీ’ తదితర చిత్రాలలో విలన్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు. కాగా అరుణ్‌ విజయ్‌ తాజాగా ట్విటర్‌లో అభిమానులతో కాసేపు మాట్లాడారు.

వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని మ‌హేష్‌బాబు గురించి ఒక్క మాట చెప్పండి అని అడగగా ‘ఛార్మింగ్‌ సూపర్‌స్టార్‌’ అని జవాబు ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, మరియు ఫాలోయింగ్ గురించి చెప్పడం, అంచనా వేయడం అసాధ్యం. హిట్ లు ప్లాప్ లకు అతీతంగా ఆయన క్రేజ్ రోజు రోజుకు అమాంతం పెరిగిపోతోంది.

మహేష్ అందగాడే కాదు అంతకుమించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు అన్నది తనతో పనిచేసిన వారు చెప్పే మాట. అందుకే మహేష్ అందరిలో మోస్ట్ లవబుల్ హీరో అయ్యడు. పని పట్ల నూటికి రెండొందలు శాతం కమిట్మెంట్ ఉన్న హీరో.

ఇటీవ‌ల `భ‌ర‌త్ అనే నేను`తో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి డైరెక్షన్‌లో తన కెరీర్‌లో 25వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే డెహ్రాడూన్‌లో ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్భంగా ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్ ఇటీవ‌ల మ‌హేష్ సినిమా సెట్‌ను సంద‌ర్శించిన సంగతి తెలిసిందే. మ‌హేష్‌బాబు, పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌ రాజు ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సన్మానించారు. ఏకంగా ముఖ్యమంత్రి రావత్‌ ప్రత్యేకంగా షూటింగ్‌ సెట్‌ను సందర్శించి చిత్రయూనిట్‌తో ముచ్చటించడంతో నార్త్ మీడియా లో ముఖ్యంగా డెహ్రాడూన్‌లో ఈ చిత్ర షూటింగ్‌కి విపరీతమైన మీడియా కవరేజ్ దక్కింది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ 25వ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

Share

Leave a Comment