ఒకరు నేర్పిస్తే రావు, చాలా గొప్ప గుణం అంటూ

ఒకప్పుడు హీరో గా చాలా కాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరిని అలరించి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మహేష్ గురించి తన అభిప్రాయాన్ని, మహేష్ తో తనకున్న అనుభవాల్ని’యాక్టర్ చిన్న’ ఇలా వివరించారు.

మహేష్ బాబు తో వర్క్ చేయాడం చాల కంఫర్టబుల్గా ఉంటుంది. చిన్న పిల్లాడి లా ఉంటాడు. సూపర్ స్టార్ క్రృష్ణ గారు కూడా అలానే ఉండేవారని విన్నాను. క్రృష్ణ గారితో ఒక్క సినిమా వర్క్ చేసాను. అప్పటికి ఆయన పెద్దాయన అయిపొయారు. ఆయన డైరక్షన్ లో చేసాను. చాల సరదాగా ఉండేవారు.

మహేష్ బాబు ది చాలా ప్యూర్ హార్ట్.. సెట్స్ లో ఆట పట్టించడం, బాగా అల్లరి చేసేవాడు. బయట ఎవరి జోలికి పోకుండా తన పని తను చూసుకుంటాడు కాని షూటింగ్ సమయాల్లో మాత్రం చాలా కలుపుగోలు గా ఉంటాడు. మురారి సినిమాకి మేము రామచంద్రాపురం లో షూటింగ్ చేసాం. నేను జెనరల్ గా బయటి భోజనం తినను.. మహేష్ కొసం ప్రొడ్యూసర్ గారి ఇంటి నుంచి లంచ్ వచ్చేది.

నేను నేరుగా మహేష్ దగ్గరికి వెళ్ళి బాబు నేను ఇలా బయటి భోజనం తినను మీరు ఏమి అనుకోకపోతే మీ కోసం పంపే లంచ్ షేర్ చేసుకుందాం అని అన్నాను.ఆయన ఎటువంటి వంకలు చెప్పకుండా తప్పకుండా అన్నారు. హీరో అయి ఉండి ఆయన అంత సింపుల్ గా అందరితో కలిసిపోతారు. చాలా మంచి మనిషి. తండ్రి గారి నుంచి వచ్చిన గుణం అది.

రెండు మూడు రోజులు ఆయన వచ్చే వరకు వెయిట్ చేసే వాళ్ళం నెను, శివాజీ రాజ.. కాని మా బందం ఎలా మారిందంటే ఒక వారం తరువాత మహేష్ తో బాబు మీ సీన్స్ లేట్ అవుతున్నాయి అంటే ఆయన వెంటనే వెళ్ళి మీరు తినండి, ఎమైన మిగిలితే నాకు ఉంచండి అని చమత్కరించేవారు.

మహేష్ ఈజ్ ఎ వెరీ నైస్ మాన్..ఎక్కడా సీరియస్ గా ఉండడు..ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అది చాలా గొప్ప క్వాలిటీ అని కొనియాడారు. ఇప్పుటికీ నాకు తెలిసి తను అలాగే సరదగా ఉంటాడు సెట్స్ లో..కొంచెం కూడా మారలేదు.. సూపర్ స్టార్ స్టేటస్ వచ్చినా కూడా చాలా సింపుల్ గా హుందా గా వ్యవహరిస్తాడు.

ఇది ఆయన నాన్న గారి నుంచి వచ్చింది. అవి అలానే ఉండిపోతాయి. ఒకరు నేర్పిస్తే రావు.. చాలా గొప్ప గుణం అది. అప్పట్లో క్రృష్ణ గారికి ఎంత మంచి పేరు ఉండేదో ప్రస్తుతం మహేష్ కి అంత మంచి పేరు ఉంది. తండ్రి కి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అని అన్నారు.

Share

Leave a Comment