మహేష్ తో నటించాలన్న కోరిక ఉంది ..

సినిమా రంగంలో ఇవాళ ఒక్క భాషలో నటిస్తూ పోతే చాలదు. మార్కెట్‌ను పెంచుకోవాలంటే పలు భాషా చిత్రాల్లో నటించాలి. మాతృభాషల నుంచి ఇతర భాషలోకి తమ మార్కెట్‌ను విస్తరించుకుంటూ కథానాయికలుగా రాణిస్తున్నారు.

అదే విధంగా నటి జననీ అయ్యర్‌ నటిగా తన పరిధిని పెంచుకోవాలని ఆశ పడుతోంది. అచ్చ తమిళ అమ్మాయి అయిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

చాలా మంది హీరోయిన్స్ కి మహేష్ తో కలిసి నటించాలని ఉంది అని ఇప్పటికే చాల సందర్భాలలో వెల్లడించారు. ఇప్పుడు ఈ జాబితా లోకి జననీ అయ్యర్‌ కూడా చేరింది.

ఇటీవల జరిగిన ఒక ప్రమోషన్ ఈవెంట్ లో ఆమె తన మనసులోని మాట ని బయట పెట్టారు. తెలుగు సినిమాల గురించి మరియు మహేష్ బాబు మీద తనకున్న అభిమానాన్ని తెలిపింది.

నిజం చెప్పాలంటే తెలుగు చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అన్ని చిత్రాలు చూస్తాను. చాలా మంది హీరోలంటే ఇష్టం. ముఖ్యంగా మహేష్ బాబుకు నేను అభిమానిని.

మహేష్ తో నటించాలన్న కోరిక ఉంది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోను.. తెలుగులో నటించాలన్న ఆకాంక్ష చాలానే ఉంది.అయితే తెలుగు లో నాకు మేనేజర్‌ లేరు అని చెప్పింది.

జననీ తాజాగా బెలూన్‌ చిత్రంతో తన సత్తా చాటుకుంటోంది. తమిళం లో మంచి పేరుని సంపాదించుకుంది. ఇందులో మరో నాయకిగా అంజిలి నటించిందన్నది గమనార్హం.

ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది.

మహేష్ అంటే తమకి ఇష్టం అని ఇప్పటికే పలు మార్లు అనేక ఇతర భాషా నటీమనులు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. టాలీవుడ్ హీరోల్లో హాలీవుడ్ క‌టౌట్ క‌నిపించే హీరో ప్రిన్స్ మ‌హేష్‌.

ఆర‌డుగుల ఎత్తు, పాల నుర‌గ‌లాంటి వ‌ర్ణం అత‌ని సొంతం. అందుకే హాలీవుడ్ హీరోలా క‌నిపిస్తాడు. సూపర్ స్టార్ మహేష్ కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మ‌హేష్ అందానికి అమ్మాయిలే ఫిదా అవుతున్నార‌నుకుంటే… ఇప్పుడు స‌హ హీరోలు కూడా ప‌డిపోతున్నారు. సాయి ధరం తేజ్ ఏకంగా మహేష్ ను మించిన అందగాడు లేడని అంటున్నాడు.

మహేష్ అందగాడే కాదు అంతకుమించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు అన్నది తనతో పనిచేసిన వారు చెప్పే మాట. పని పట్ల నూటికి రెండొందలు శాతం కమిట్మెంట్ ఉన్న హీరో.

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీమంతుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ వస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతుంది.

మహేష్ తన తదుపరి చిత్రాన్ని ఏప్రిల్ నెలలో పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత‍్వంలో తన సిల్వర్‌ జూబ్లీ సినిమాను చేయనున్నాడు.

Share

Leave a Comment