నవ్వుతూ నవ్విస్తూ..

సహజ నటి సీనియర్ హీరోయిన్ జయసుధ గారు ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మ పాత్రలకు పెట్టింది పేరు అయ్యారనడంలో అతిసయోక్తి లేదు. అమ్మ పాత్రలో స్టార్స్ కు జయసుధ గారిని ఎక్కువగా ఎంపిక చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుకు పలు సినిమాల్లో అమ్మగా నటించారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్రహ్మోత్సవం మహర్షి చిత్రాల్లో మహేష్ బాబుకు అమ్మ గా నటించారు జయసుధ గారు. ఒక ఇంటర్వ్యూలో షూటింగ్ అనుభవాలను మహేష్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకొచ్చారు. ఆవిడ మాట్లాడుతూ మహేష్ నేను హీరోయిన్ గా నటించిన సినిమాలో బాల నటుడిగా చేశాడు. అందుకే అప్పటి నుండే నాకు మహేష్ తెలుసు.

మహేష్ చాలా మంచి వ్యక్తి. ఎంత పెద్ద స్టార్ అయినా ఏమాత్రం గర్వం ఉండదు. పెద్దలను గౌరవించడంతో పాటు చాలా నిజాయితీగా మాట్లాడతాడు. అతడితో నటిస్తున్న సమయంలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. విజయ నిర్మల గారు నాకు బందువు అవ్వడం వల్ల కృష్ణ గారి ఫ్యామిలీతో చాలా ఏళ్లుగా సన్నిహిత్యం నాకు ఉంది.

ఆ అనుబంధం వల్ల మహేష్ ను చిన్నప్పటి నుండి ఎక్కువగా కలవడం జరిగింది. మహేష్ ఏ సినిమా చేసినా దాన్ని తన మొదటి సినిమానే పరిగణించి చేస్తూ ఉంటాడు. మహేష్ చాలా చాలా నాటీ. ఎక్కువగా ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో తను నవ్వడు, మనం మాత్రం పగలబడి నవ్వుతాం. చాలా చాలా చాలా నాటీ.

తను ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలో చేయాలి. అప్పుడే మనం రియల్ మహేష్ ను చూస్తాం. అంతలా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు మహేష్. ఎప్పుడో దూకుడు ఖలేజాలో ఫుల్ లెంగ్త్ కామెడీ చేసాడు. ఇప్పుడు చేస్తున్న సినిమా ఎలాంటిదో మరి నాకు ఐడియా లేదు. మహేష్ ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తే చూడాలి.

తను ఈ పాత్రనైనా అవలీలగా చేయగలడు. అంత టాలెంట్ అతని సొంతం. దర్శకుడు ఏది చెప్తే అది ఇచ్చేందుకు చాలా కష్టపడుతూ ఉంటాడు. దర్శకుడు ఎలా మల్చుకోవాలనుకుంటే మహేష్ అలా మారిపోతాడు. డైరెక్టర్స్ యాక్టర్ మహేష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మహర్షి చిత్రంలో మహేష్ బాబు నటన తారా స్థాయికి వెళ్లింది. రెండు మూడు సీన్స్ లో మహేష్ బాబుతో యాక్టింగ్ చేసే సమయంలో అతడి యాక్టింగ్ చూసి నేను ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం మర్చి పోయాను. నాతో కంట తడి పెట్టించాడు. మహేష్ యాక్టింగ్ కు సెట్స్ లోనే కన్నీరు పెట్టుకున్నాను. అంతగా పాత్రలో ఒదిగిపోయి నటించాడు.

మహర్షి చిత్రంలోని నటనకు గాను మహేష్ బాబుకు అవార్డు రావడం ఖాయం. ఎవర్ గ్రీన్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మహర్షి సినిమా కోసం మహేష్ ప్రాణం పెట్టాడు. ఇంత గొప్ప యాక్టర్ సౌమ్యుడు పెద్దవాళ్లంటే గౌరవమున్న నటుడిని తాను ఇంతవరకూ చూడలేదని జయసుధ చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు ఈ పేరు ముందు మహేష్ అభిమాన గ‌ణం ప్రిన్స్ అని సూప‌ర్‌స్టార్ అని చేర్చి మ‌రీ పిలుచుకుంటారు. ప్రేక్షకులు తన మీద చూపించిన అభిమానానికీ చూపిన ఆదరణకీ న్యాయం చేసి తిరిగి అంతకు మించి ఇవ్వడానికి తనలో ఒక కొత్త ఆలోచన నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఎదో ఒక కొత్తదనం తోనే మహేష్ సినిమాలు ఉంటాయి.

Share

Leave a Comment