మ‌హేష్ గురించి ప్రణీత ఏమందంటే

ప్రణీత ను బహుభాషా నటి అనే అనాలి. మాతృభాష కన్నడంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో మంచి హీరోయిన్‌ అనిపించుకుంది. తెలుగు చిత్రసీమ లో అగ్ర హీరోల సరసన ఆడి పాడిన కథానాయిక.

కేవలం మహేష్ చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇప్పుడు ఈ జాబితా లోకి నటి ప్రణీత కూడా చేరింది.

ఈ సాండల్వుడ్ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తింది. మహెష్ ని పర్ఫెక్ట్ పర్సెన్ గా అభివర్నించింది. ఇంకా మహేష్ తో పనిచేసిన అనుభవాలను వివరించింది.

“మహేష్ బాబు గారు నాకు తెలిసి పర్ఫెక్ట్ సూపర్ స్టార్. ఆయన ఒక పెర్ఫెక్షనిస్ట్. నేను ఆమిర్ ఖాన్ గారి తో ఎప్పుడూ వర్క్ చేయలేదు, అందరు ఆయన్ని అలా అంటారు.

కాని నాకు మాత్రం “మహేష్ ఈస్ ధి పెర్ఫెక్షనిస్ట్”. ఆయనతో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

మహేష్ సీన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైన ఇల అదనంగా ఒకసారి కళ్ళు బ్లింక్ చేసినా కూడా ఆయన మళ్ళీ చేద్దాం అంటారు. అంత పెర్ఫెక్షన్ కోసం తాపత్రయ పడతారు.

అందరు అయితే టేక్ ఓకె చేద్దాం అనినా కూడా మహేష్ సార్ మాత్రం దాని వల్ల సీన్ చేంజ్ అవుతుంది మళ్ళీ చేస్తా అంటారు. ఆయన ఒక సూపర్ స్టార్, ఆయన స్థాయి కి ఇంత సింపుల్ గా ఉండక్కర్లేదు.

ప్రతీ షాట్ చాలా కేర్ తీసుకుని చేస్తారు. ప్రతీ సినిమా ఆయన తన ఫస్ట్ సినిమా లా భావించి చేస్తారు. చాల చిన్న చిన్న డీటేల్స్ కూడా కేర్ తీసుకుని మిస్ అవ్వకుండా చుసుకుంటారు.

అందుకే నాకు మహేష్ గారు ‘ధి పెర్ఫెక్షనిస్ట్’. ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చు. షూటింగ్ లో కూడా చలా సరదాగ ఉంటారు. ఆయన పెర్ఫార్మెన్స్ కి ఎలాంటి వంకలు పెట్టడనికి స్కోప్ ఇవ్వరు.”అని చెప్పింది.

ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది.

Share

Leave a Comment