ఆ సినిమా చూసినప్పటినుంచి..

మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను తనవైపు తిప్పుకున్నారు రీతూవర్మ. పెళ్లి చూపులు సినిమా హిట్‌తో రీతూ వర్మ టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయారు. ఇప్పటికే కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్ గౌతమ్ మీనన్,విక్రమ్ సినిమా, మలయాళ స్టార్ దుల్హర్ సల్మాన్‌ సినిమాలో నటించారు రీతూవర్మ.

రీతూవర్మను మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు అని అడగగా ఆమె ఇలా స్పందించారు. నా ఫేవరట్ హీరో మహేష్ బాబు. నాకు ఇప్పటికి ఇంకా చాలా బాగా గుర్తుంది. ఒక్కడు సినిమా చూసినప్పుడు ఆయనికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను.

మ్యూజిక్ సిడి తెచ్చుకుని మరీ ఐ యూస్డ్ టు హియర్ ది సాంగ్స్ ఎవ్రీడే. సో ఐ యాం ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు సర్. నా దృష్టిలో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు. నా డ్రీం హీరో టు యాక్ట్ విత్ కూడా మహేష్ బాబు గారే అని తెలిపారు.

ఆయనకి తనకంటూ ప్రత్యేకమైన చార్మ్ ఉంది. అందులోను ఇంపెకబుల్ యాక్టర్. అందుకే ఆయన్ని అభిమానించే వారి సంఖ్య చాలా ఎక్కువ అని చెప్పారు రీతూవర్మ. ఇప్పుడే కాదు మొదటి నుంచి ఆమె అనేక పర్యాయాలు తన అభిమాన నటుడు మహేష్ బాబు అని చెప్పిన విషయం మనకి తెలిసిందే.

తమిళంలో ఆసక్తికరమైన కథల్లో నటించే అవకాశాలు లభిస్తున్నాయి. అయినా ఇప్పుడు తెలుగు, తమిళం అని వేరుగా చూడాల్సిన అవసరం లేదు. దాదాపు చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతుంటాయి కాబట్టి నేను తమిళానికే పరిమితమవుతున్నట్టు అస్సలు అనిపించడం లేదు. తెలుగు కథలూ వింటున్నా అన్నారు రీతూవర్మ.

మహేష్‌ కి మాస్‌ నుంచి క్లాస్‌ వరకు, అమ్మాయిలు, ముసలివారు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ అభిమానులు ఉన్నారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌ కు కేవలం మాములు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంచి ఫాలోయింగి ఉంది.

అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు వచ్చే నూతన నటీమనుల నుంచి వేరే భాష లో నటిస్తున్న అగ్ర హీరోయిన్స్ వరకు అందరికి మన టాలివూడ్ లో సుపరిచితమైన పేరు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ 27వ సినిమా త్వరలో సెట్స్ కి వెల్లనుంది.

ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట.

మహేష్ అభిమానులు కోరుకునే విధంగా ఈ మూవీ స్క్రిప్ట్ పరశురామ్ రెడీ చేసాడని టాక్. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది అని తెలిపాడు పరశురామ్‌. ఇక ఈ సినిమా పై సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులలో భారీ అంచనాలే ఏర్పడ్డాయని చెప్పవచ్చు.

Share

Leave a Comment