మరికొన్ని రోజుల్లో మొదలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా భరత్ అనే నేను సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇక తన కెరియర్లోనే మైలురాయి లాంటి 25వ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహనన్ కెమెరామెన్ గా పనిచేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పక్కాగా జరిగిన ఈ చిత్రం తొలి షెడ్యూల్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల రెండవ వారం నుంచి డెహ్రాడూన్ లో షూటింగ్ మొదలుకానుంది.

చిత్ర యూనిట్ మొన్నటి వరకు మొదటి షెడ్యూల్ యూఎస్ లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు నార్త్ ఇండియా హిల్ స్టేషన్ డెహ్రాడూన్ లో షూటింగ్ మొదలు పెట్టాలని తేదీలను ఫిక్స్ చేసుకున్నారు.

ఈ షూటింగ్ షెడ్యూల్ అయిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం అమెరికాకి వెళ్లనుంది. అక్కడ అందమైన ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ భారీ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు సాగనుంది.

ఇక ఈ సినిమాపై దిల్ రాజు, వైజయంతి మూవీస్ సంస్థలు ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నాయి. మూడు షెడ్యూల్స్ లో సినిమాను కంప్లీట్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేసింది. ఫస్ట్ షెడ్యూల్ నార్త్ ఇండియాలోని డెహ్రాడూన్ లో స్టార్ట్ అవుతుంది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లోను, మూడో షెడ్యూల్ అమెరికాలోను ఉంటుంది అని సమాచారం.

జూన్ సెకండ్ వీక్ లో మొదలు పెట్టి వీలైనంత త్వరగా షూటింగ్ ను ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే అక్కడి ప్రాంతంలో మంచి లొకేషన్స్ ని ఎన్నుకున్న వంశీ ఈ మేరకు మంచి ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ మొదటి షెడ్యూల్ లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.

మహేష్ కెరీర్ లో 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా టోటల్ తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి ఏడాది క్రితమే కథని సిద్ధం చేసిన డైరక్టర్ వంశీ పైడిపల్లి ఇక ఈ చిత్రాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్తాడో చూడాలి.

Share

Leave a Comment