సెట్స్ లో సెలబ్రేషన్స్

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన అల్ల‌రి నరేష్ ఆన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీతో కిత‌కిత‌లు పెట్టించే ఈ అల్ల‌రోడు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌హేష్ 25వ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

అయితే ఈ చిత్రం ప్ర‌స్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. న‌రేష్ కూడా కొన్నాళ్లుగా టీంతోనే ఉన్నాడు. నిన్న అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్ డే కావడంతో చిత్ర యూనిట్ అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డేని సెట్‌లోనే జరిపించారు. మ‌హేష్ , పూజా హెగ్డే, వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు న‌రేష్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ పాల్గొన్నారు.

బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు ప్రొడక్షన్ యూనిట్ అఫీషియల్ గా విడుదల చేసాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో మహేష్ తో పాటు, వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే, డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఇంకా దిల్ రాజు సోదరుదు శిరీష్ ఉన్నారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అల్లరి నరేష్‌ మహేష్ బాబు 25వ సినిమాలో వున్నట్టే కాకుండా, ఆ సినిమాలో నరేష్‌ పేరు కూడా చెప్పేశారు వంశీ పైడిపల్లి. ‘మా “రవి” అల్లరి నరేష్‌ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీతో పనిచేయడం చాలా బాగుంది. విష్ యు ఎ గ్రేట్ ఇయర్ ఎహెడ్. టీం #మహేష్25’ అని ట్వీట్ చేశారు వంశీ పైడిపల్లి.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ 25వ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. డెహ్రాడూన్‌లో ఈ చిత్ర షూటింగ్‌కి విపరీతమైన మీడియా కవరేజ్ దక్కుతుంది. సౌత్ సూపర్‌స్టార్ అంటూ రోజుకు ఒక ఆర్టికల్ ఈ మూవీ షూటింగ్ గురించి లోకల్ న్యూస్ పాపర్స్‌లో ప్రింట్ చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇంస్టిట్యూట్ లో జరుగుతుంది. దీనినే ఐఐటి గా సినిమాలో చూపించనున్నారని సమాచారం. కాలేజీ సీన్ల‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మహేష్ , పూజ హెగ్డేల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటుగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ మీద కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలుస్తుంది.

నరేష్‌ మొట్ట మొదటి సారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్నారు. ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసారని వినికిడి.

సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో తన కొత్త సినిమా కోసం రంగంలోకి దిగిపోయారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ముహూర్తం దసరాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. మ‌హేష్ ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆ లోపు పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు కనక ప్లానింగ్ లో ఎక్కడా తేడా రాకుండా సెట్ చేసుకుంటున్నారట సుకుమార్. మరో సారి కొత్త కథ తో తనదైన శైలి లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా పక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుక్కు అండ్ టీం.

Share

Leave a Comment