మ‌హేష్‌ మూవీలో నరేష్‌ రోల్

రాజేంద్రప్రసాద్‌ తర్వాత కామెడీకి ఆ స్థాయి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన నటుడు అల్లరి నరేష్‌. ఆయన తెరపై కనిపించాడంటే చాలు ప్రేక్షకులకు కితకితలు గ్యారెంటీ. తొలి చిత్రం ‘అల్లరి’తోనే కడుపుబ్బా నవ్వించాడాయన. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. 13 యేళ్ల వ్యవధిలోనే యాభై సినిమాల మైలురాయిని అందుకొన్నారు.

యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని నవ్వించడం అల్లరి నరేష్‌ శైలి. కామెడీలోనే కాదు వైవిధ్యమైన చిత్రాల్లో నటుడిగా కూడా సత్తా చాటారు అల్లరి నరేష్‌. ఈరోజు నరేష్‌ జన్మదినం. నరేష్‌ మొట్ట మొదటి సారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటిస్తున్న విషయం తెలిసిందే.

కానీ నిర్మాత, దర్శకుడు ఎవరి దగ్గర నుంచి కూడా అధికారికంగా ఇప్పట్టి వరకు అల్లరి నరేష్‌ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ రోజు ఆ అధికారిక ప్రకటన వెలువడింది. అల్లరి నరేష్‌ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు 25వ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ వార్తను దృవీకరించారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అల్లరి నరేష్‌ మహేష్ బాబు 25వ సినిమాలో వున్నట్టే కాకుండా, ఆ సినిమాలో నరేష్‌ పేరు కూడా చెప్పేశారు వంశీ పైడిపల్లి. ‘మా “రవి” అల్లరి నరేష్‌ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీతో పనిచేయడం చాలా బాగుంది. విష్ యు ఎ గ్రేట్ ఇయర్ ఎహెడ్. టీం #మహేష్25’ అని ట్వీట్ చేశారు వంశీ పైడిపల్లి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల డెహ్రడూన్ లో మొదలైంది. చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇంస్టిట్యూట్ లో జరుగుతుంది. దీనినే ఐఐటి గా సినిమాలో చూపించనున్నారని సమాచారం. కాలేజీ సీన్ల‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. జూలై 6 వరకు షూటింగ్ అక్కడే జరగనుంది. ఈ వారంలో సాంగ్ షూట్ కూడా పూర్తి చేయనున్నారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం మూవీ టీమ్‌ యూఎస్‌ వెళ్తారట.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ 25వ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. డెహ్రాడూన్‌లో ఈ చిత్ర షూటింగ్‌కి విపరీతమైన మీడియా కవరేజ్ దక్కుతుంది. సౌత్ సూపర్‌స్టార్ అంటూ రోజుకు ఒక ఆర్టికల్ ఈ మూవీ షూటింగ్ గురించి లోకల్ న్యూస్ పాపర్స్‌లో ప్రింట్ చేస్తున్నారు.

Share

Leave a Comment