మొదటిగా అవే గుర్తొస్తాయి..

అతిథి సినిమాలో హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించారు అమృతారావు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత మరో తెలుగు సినిమాలో ఆమె కనిపించలేదు. ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు అమృత.

అతిథి విశేషాలను ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు అమృతారావు.. మ‌హేష్ తో చేసిన అతిథి లో నా కేర‌క్ట‌ర్ నాకు చాలా ఇష్టం. నా కేర‌క్ట‌ర్ మహేష్ తో సమానంగా ఆ సినిమాలో ట్రావెల్ చేస్తుంది. పైగా న‌మ్ర‌త‌, మ‌హేష్ నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చాలా నచ్చింది.

అతిథి సినిమా ఎప్పుడు షూటింగ్ జ‌రిగిందో, ఎప్పుడు పూర్త‌యిందో అర్థం కానంత త్వ‌ర‌గా అయిపోయింది. న‌మ్ర‌త‌, మ‌హేష్ బాబు నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకునేవారు. తెలుగు సినిమా అని ఎవ‌రైనా అన‌గానే నాకు మొదటిగా మ‌హేష్ ఇల్లు గుర్తొస్తుంది.

షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన ప్రతీసారీ మహేష్ ఇంటి నుంచే నాకు ప్రతీ రోజు భోజనం పంపించేవారు. అతిథి సినిమాలో నటిస్తున్నప్పుడు ఒకే నెలలో మూడు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. అతిధి లో ఇంత మంచి పాత్ర చేసాక ఇంపార్టెన్స్ ఎక్కువ లేని ఏ పాత్ర నచ్చక ఒప్పుకోలేదు.

అతిథి లో నటించిన సంవత్సరం తరువాత హైదరాబాద్ లోనే లెజెండరీ డైరెక్టర్ శ్యాం బెనెగల్ గారి సినిమాలో నటించాను. హైదరాబాద్ తో నాకు చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి. హైదరాబాద్ అనగానే ఆంధ్రా వంటకాలు, మ‌హేష్ ఇంటి నుంచి వ‌చ్చిన బ్రౌన్ రైసూ గుర్తుకొస్తాయి అని చెప్పారు.

మహేష్ నమ్రత దంపతుల ఆతిధ్యం చాలా బావుంటుందని కైరా అడ్వాణీ కూడా ఇటివలే తెలిపిన విషయం మనకు తెలిసిందే. కాని ఇక్కడ విశేషం ఏంటంటే అమృతారావు, కైరా అడ్వాణీ ఇద్దరికీ తెలుగులో మహేష్ తోనే మొదటి సినిమాతో పరిచయమయ్యారు. సూపర్‌స్టార్ పక్కన మొదటి సినిమా తో తెలుగుకి పరిచయం అయ్యే చాన్స్ ఎంతమందికి వస్తుంది.

మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. ఆయన చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని అందరు ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మహేష్ ఈ విషయం లో మాత్రం అందరికంటే చాలా స్పెషల్ అనే చెప్పాలి.

సరిలేరు నీకెవ్వరు సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్ళొచ్చిన సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమా కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతుంది చిత్రబృందం.

Share

Leave a Comment