మహేష్ గారు పేకాడేసారు

బార్డర్ లో తుపాకి వేట, ఊళ్లోకొస్తే గొడ్డలి వేట! అసలు మహేష్ తీరే వేరుగా ఉంది. సరిలేరు నీకెవ్వరు, నువ్వు వెళ్లేది రహదారి! అంటూ అనిల్ రావిపూడితో కలిసి ప్రయోగమే చేస్తున్నాడు. 2020 సంక్రాంతి టార్గెట్ ఎంచుకుని చిత్రయూనిట్ అంతే వేగం చూపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ చిత్రీకరణను పూర్తి చేశారు. బ్యాలెన్స్ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు.

ఇదివరకే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తొలి సింగిల్ ని మిలటరీ బ్యాక్ డ్రాప్ లో రివీల్ చేశారు. ఆర్మీ మేజర్ లుక్ లో మహేష్ గెటప్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ కుర్రకారులోకి దూసుకెళ్లిపోయాయి. తాజాగా దసరా పండుగను పురస్కరించుకుని సరిలేరు నీకెవ్వరు టీం ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టి ఈవిల్ ని వేటాడుతున్న డెవిల్ లా కనిపిస్తున్నాడు మహేష్. ఆర్మీ మేజర్ లుక్ లోనే కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ లోనూ. యుద్ధం అనేది కేవలం బోర్డర్ లో చేసేదే కాదు. ప్రతి ఊళ్లోనూ యువతరం యుద్ధం చేయాల్సిందే అన్నట్టుగా సందేశం ఇస్తోంది ఈ పోస్టర్.

ఈవిల్ ని నాశనం చెయ్, సగర్వంగా విజయదశమికి సమర్పిస్తున్నాం అంటూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసారు మహేష్. విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కాశ్మీర్ నుంచి వచ్చిన సైనికుడికి కర్నూల్లో పనేంటో కాస్త విశదంగా చెబుతారేమో చూడాలి. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు దగ్గర భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించింది చిత్రబృందం. ఇప్పుడు ఆ పోస్టర్ నే విడుదల చేసారు.

ఈ చిత్రం లో విజయశాంతి ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. యాక్షన్, కామెడీ సంపూర్ణ వినోదంతో సరిలేరు నీకెవ్వరు అలరిస్తుందని ఇప్పటికే దర్శకుడు అనీల్ రావిపూడి వెల్లడించారు. ఈ పోస్టర్ విడుదల అయిన సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మీడియా చానెల్ తో సినిమా గురించి ఆశక్తికర విషయాలను చెప్పుకొచ్చారు అనిల్.

నేను ఇంతకు ముందే చెప్పాను. సినిమా కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది 100 పర్సెంట్. అందులో డౌట్ లేదు. ఒక ఆర్మీ వ్యక్తి మన సమాజంలోకి వచ్చే చేసే పనులు. దీనితో పాటు సినిమాలోని మిగతా పాత్రలు. వియయశాంతి గారి పాత్ర చాలా ముఖ్యం ఈ సినిమాకు, అంత మంచి రోల్ ఆమెది. నిన్నే ఫస్ట్ హాల్ కూడా లాక్ చేసేసాం.

ఫస్ట్ హాఫ్ రష్ చూసాం. వుయ్ ఆర్ వెరీ వెరీ వెరీ వెరీ హ్యాపీ. ఎవరి పాత్రలు వారు ఇరగదీసి అవతల వేసారు. అంత బాగా వచ్చింది. విజయశాంతి గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇక మహేష్ బాబు గారు. ట్రైన్ ఎపిసోడ్ గురించి మీరు విన్నారు. రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఆయన చేసిన అల్లరి నాకు తెలిసి అదే ఏదైతే ఈ గ్యాప్ లో తన సినిమాల్లో మిస్ అయ్యిందో అది ఉంటుంది.

సరిలేరు నీకెవ్వరు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. 360 డిగ్రీస్ అనమాట మహేష్ గారు చించి అవతల వేసారు. చాలా బాగా వచ్చింది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ మాత్రమే కాకుండా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. మహేష్ బాబు గారి సూపర్‌స్టార్ ఉన్నప్పుడు ఎంతోకొంత మెసేజ్ ఉండాలి. ఏదో అలా ఫన్ మాత్రమే ఉండకూడదు.

దానికి తగ్గ కథ కూడా చెప్పాలి. అది కూడా ఇందులో కుదిరింది. అలా అన్ని ఎలిమెంట్స్ కుదిరాయి. పేకాడేసారు అది అనమాట. కర్నూలు అనేది మా సినిమా కథ జరిగే చోటు. మహేష్ గారికి, కర్నూల్ కొండారెడ్డి బురుజు తో ఒక్కడు సినిమా వల్ల ఆడియెన్స్ కి మంచి కనెక్ట్ ఉంది. ఇన్ని ఏళ్ళు అయినా బురుజు అనగానే ఒక్కడు గుర్తుకు వస్తుందంటే ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక ఎలిమెంట్ ని మేము మా కథ లో వాడుకున్నాం. కొడారెడ్డి బురుజు దగ్గర కొన్ని చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయి. నూరు శాతం ఎవరి అంచనాలకు తగ్గకుండానే ఈ కర్నూల్ ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా ఫ్రెష్ గానే కాకుండా చాలా మాస్ గా ఉంటాయి కొండారెడ్డి బురుజు ఎపిసోడ్ అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

Share

Leave a Comment