అద్భుతంగా ఉండబోతున్నాయంటూ..

మహర్షి బ్లాక్ బస్టర్ సాధించడంతో ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే విదేశాలకు హాలిడే కోసం వెళ్లిన మహేష్ బాబు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు.. తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గోనున్నాడు.

మహేష్ ఈ సినిమా లో ఆర్మీ లో మేజర్ పాత్ర ను పోషించనున్నాడని దర్శకుడే స్వయంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసాయి. అతి త్వరలో ఈ సినిమ రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ప్రధాన తారాగనమంతా ఈ షెడ్యూల్ లో పాల్గోనున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడికి మొదటి నుంచి కూడా ఒకరు కెరీర్లో తోడుగా ఉన్నారు. అతడే రాజేంద్ర ప్రసాద్. ప్రతి సినిమాలో కూడా ఆయనకు ఒక కీలకమైన పాత్ర ఇస్తుంటాడు అనిల్. ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ కూడా అనిల్ రావిపూడి సినిమాలో నుంచి వచ్చినవే.

సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాల్లో కడుపుబ్బ నవ్వించే పాత్రలు ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ కు అద్భుతమైన పాత్ర ఇస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. మహేష్ – రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ వల్ల ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి.

ఇదే విషయాన్ని మీడియా ముందు కన్ఫర్మ్ చేశాడు అనిల్ రావిపూడి. తన ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు అద్భుతమైన పాత్ర ఉంటుందని.. తాను ఇండస్ట్రీలో ఆయనను డాడీ అని పిలుస్తాను అని చెబుతున్నాడు అనిల్. సరిలేరు నీకెవ్వరు లో కూడా మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ మధ్యలో అద్భుతమైన కామెడీ సీన్స్ ఉంటాయని తెలిపారు.

అంతే కాకుండా చాలా రోజుల తర్వాత మళ్లీ రాజేంద్రప్రసాద్ విశ్వరూపం చూస్తారు అంటున్నాడు ఈ దర్శకుడు. దానికి తోడు మహేష్ బాబు కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుందని.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని అనడంతో అవి హైలైట్ గా నిలవనున్నాయని దర్శకుడి కాంఫిడెన్స్ చూస్తే ఇట్టే అర్ధం అయిపోతుంది.

కచ్చితంగా సరిలేరు నీకెవ్వరు కూడా సంచలన విజయం సాధించడం ఖాయం అంటున్నారు అనిల్ రావిపూడి. తన కెరీర్ బిగినింగ్ స్టేజ్ లోనే మహేష్ తనని నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం తను ఎప్పటికీ మరిచిపోలేను అని మహేష్ ఋణాన్ని బ్లాక్‌బస్టర్ ఇచ్చి తీర్చుకుంటా అన్నారు.

అప్పుడే సంక్రాంతి రేస్ కు సరిలేరు సిద్ధమవుతుంది. దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది..దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించబోతోంది.

దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నేనొక్క‌డినే, శ్రీ‌మంతుడు, మ‌హ‌ర్షి లాంటి సినిమాల త‌ర్వాత మ‌రోసారి మ‌హేష్ సినిమాకు ప‌ని చేస్తున్నాడు ఈయ‌న‌. అంతే కాకుండా ఈ సారి ఖచ్చితంగా మాస్ సాంగ్ ఇస్తా అని ప్రెస్‌మీట్ లో ప్రామిస్ చేసి మరీ చెప్పడంతో అభిమానులు ఈ సినిమా పాటల కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

ఎఫ్ 2 విజ‌యంతో అనిల్ రావిపూడి, మ‌హ‌ర్షి విజ‌యంతో మ‌హేష్ మాంచి జోష్ లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో స‌రిలేరు నీకెవ్వ‌రు పై భారీ ఎక్స్ పెక్టేష‌న్సే ఏర్పాడ్డాయి. మ‌రి ఈ సినిమా ఎలాంటి స‌క్సెస్ అందుకోనుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Share

Leave a Comment