మహేష్ విజయశాంతి మధ్య ఉండే సీన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా వరుస సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే భరత్ అనే నేను మరియు మహర్షి లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకున్న మహేష్ ఫుల్ జోష్ లో ఉన్నారు. దీనితో మూడో బ్లాక్ బస్టర్ కోసం సినీ ప్రేక్షకులు ఉవ్విల్లూరుతున్నారు.

ఈ చిత్రంలో మహేష్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కు సంబంధించి దసరా పండుగను పురస్కరించుకుని సరిలేరు నీకెవ్వరు టీం ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రం లో విజయశాంతి ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

యాక్షన్, కామెడీ సంపూర్ణ వినోదంతో సరిలేరు నీకెవ్వరు అలరిస్తుందని ఇప్పటికే దర్శకుడు అనీల్ రావిపూడి వెల్లడించారు. ఈ పోస్టర్ విడుదల అయిన సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మీడియా చానెల్ తో సినిమా గురించి ఆశక్తికర విషయాలను చెప్పుకొచ్చారు అనిల్. విజయశాంతి, మహేష్ బాబు మద్య ఉండే సీన్స్ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు.

నేను ఇంతకు ముందే చెప్పాను. సినిమా కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది 100 పర్సెంట్. అందులో డౌట్ లేదు. ఒక ఆర్మీ వ్యక్తి మన సమాజంలోకి వచ్చే చేసే పనులు. దీనితో పాటు సినిమాలోని మిగతా పాత్రలు. వియయశాంతి గారి పాత్ర చాలా ముఖ్యం ఈ సినిమాకు, అంత మంచి రోల్ ఆమెది. నిన్నే ఫస్ట్ హాల్ కూడా లాక్ చేసేసాం.

ఫస్ట్ హాఫ్ రష్ చూసాం. వుయ్ ఆర్ వెరీ వెరీ వెరీ వెరీ హ్యాపీ. ఎవరి పాత్రలు వారు ఇరగదీసి అవతల వేసారు. అంత బాగా వచ్చింది. ఆవిడ అసలు, అదే కదా చెప్తున్నా నిన్నే ఫస్ట్ హాఫ్ చూసాం. ఎక్కడా కూడా ఆవిడ పదమూడు ఏళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి వచ్చినట్లు ఉండదు. డైనమిక్, డైనమిక్ అనమాట.

ఈ సినిమాకి కథ, కంటెంట్, మహేష్ గారి క్యారెక్టరైషేషన్, ఆయన్ ఎనర్గీ లెవల్స్ ఎంత ఫ్రెష్ గా ఉంటాయో అంతే ఫ్రెష్ గా విజయశాంతి గారి రోల్ కూడా ఉంటుంది. మనకు ఆ కాంబినేషన్ యే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మహేష్ గారికి విజయశాంతి గారికి మధ్య ఉండే సీన్స్ గానీ, ఎమోషనల్ కంటెంట్ గానీ చాలా బాగుంటుంది. ఇట్స్ గోయింగ్ టూ బి ఫీస్ట్ అండి. అంతే.

ఇది ఏదో ఓవర్ కాంఫిడెన్స్ తో చెప్పడం కాదు. వచ్చిన అవుట్ పుట్ తో మేమంతా వెరీ హ్యాపీ అనమాట. మేము స్క్రిప్ట్ అప్పుడు ఏం అనుకున్నామో, స్క్రిప్ట్ స్టేజ్ నుంచి స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాం. అంత అద్భుతంగా వచ్చింది. విజయశాంతి గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇక మహేష్ బాబు గారు. ట్రైన్ ఎపిసోడ్ గురించి మీరు విన్నారు. రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు.

ఆయన చేసిన అల్లరి నాకు తెలిసి అదే ఏదైతే ఈ గ్యాప్ లో తన సినిమాల్లో మిస్ అయ్యిందో అది ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. 360 డిగ్రీస్ అనమాట మహేష్ గారు చించి అవతల వేసారు. చాలా బాగా వచ్చింది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ మాత్రమే కాకుండా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. మహేష్ బాబు గారి సూపర్‌స్టార్ ఉన్నప్పుడు ఎంతోకొంత మెసేజ్ ఉండాలి.

ఏదో అలా ఫన్ మాత్రమే ఉండకూడదు. దానికి తగ్గ కథ కూడా చెప్పాలి. అది కూడా ఇందులో కుదిరింది. అలా అన్ని ఎలిమెంట్స్ కుదిరాయి. పేకాడేసారు అది అనమాట. ఇన్ని ఏళ్ళు అయినా బురుజు అనగానే ఒక్కడు గుర్తుకు వస్తుందంటే ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక ఎలిమెంట్ ని మేము మా కథ లో వాడుకున్నాం. నూరు శాతం ఎవరి అంచనాలకు తగ్గకుండానే ఈ కర్నూల్ ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా ఫ్రెష్ గానే కాకుండా చాలా మాస్ గా ఉంటాయి కొండారెడ్డి బురుజు ఎపిసోడ్ అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

Share

Leave a Comment