అందుకే సాధ్యమైంది

ఫన్ అంటే తనకి చాల ఇష్టమని చెబుతున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాల్లో కూడా అది మిస్ కాకుండా చూసుకుంటున్నాడు. సరిలేరు నీకెవరుతో పర్ఫెక్ట్ పండగ సినిమాని ప్రేక్షకులకి అందించిన ఈ యంగ్ డైరెక్టర్ ఒక ప్రముఖ వెబ్‌సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు చూద్దాం.

ఎఫ్ 2 సరిలేరు రెండిటిలో ఉన్న కామన్ పాయింట్ కామెడీ అలానే రెండూ కమర్షియల్ ఎంటెర్టైనెర్స్ మరి ముఖ్యం గా రెండూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. సరిలేరు నీకెవరు ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని నా నమ్మకం ఆల్రెడీ 100 కోట్లు పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. సరిలేరు షూటింగ్ మొత్తం నేను ఎంజాయ్ చేశాను ఫ్రస్ట్రేషన్ వచ్చేంత సందర్భాలు ఎప్పుడు నాకు ఈ సినిమా విషయం లో ఎదురవ్వలేదు.

మహేష్ గారు ఈ మధ్య చేసిన సినిమాలు అన్నిట్లో అయన నటనకి కొంత పరిమతిలు ఉంటాయి కానీ సరిలేరు లో మాత్రం అయన క్యారెక్టర్ కి ఎలాంటి బోర్డర్స్ ఉండవు రియల్ మాస్ హీరో పాత్ర ఇది. అందుకే సినిమా చూసినప్పుడు మొత్తం ఆయనే కనిపిస్తాడు నిజానికి సినిమా ఇంత హిట్ అవ్వడానికి మహేష్ గారి పవర్ఫుల్ యాక్షన్ ముఖ్య కారణం.

అయన వల్లే సరిలేరు నీకెవరు నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రేంజ్ లో బ్లాక్బస్టర్ దిశగా పరుగులు తీస్తుంది. ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేసి చాలా కాలం అయింది. అందుకే ఈ విషయం సాధ్యమైంది. వెంకటేష్ బాబు చూసి ఫోన్ చేసి అభినందించారు. చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు ఇలా ఒకరు ఇద్దరు అని కాదు చాలా మంది నుంచి.

ఇక ఫ్యాన్స్, అభిమానుల వాట్సప్ మెసేజ్ లకు అంతే లేదు. ఫలానా సీన్ బాగుంది, ఫలానా సీన్ పండింది అంటూ సినిమాలో ఎమోషన్ మినహా మరెక్కడా ఫన్ వదల కూడదన్నది నా ప్లాన్. అందుకే పైట్లలో కూడా ఫన్ టచ్ ఇచ్చాను. అందులో భాగంగానే వచ్చిన ఐడియా రమణా లోడొచ్చింది ఫన్ బిట్.

పండుగ టైం లో నా సినిమా ఉండాలి అని నేను ఫోకస్ పెట్టి సినిమాలు చేసిన సందర్బాలు లేవు అండి కానీ రాజా ది గ్రేట్ నుంచి అల కలిసి వస్తుంది ఐతే సరిలేరు నీకెవరు ని మాత్రం పండగకి రిలీజ్ చేయాలి అని ముందే అనుకున్నానం. ఈ సీసన్ కి తగ్గట్లుగానే ఈ సినిమాని రెడీ చేసాము.

మొదటి నుంచి నా ఫోకస్ మొత్తం కమర్షియల్ సినిమాలు పైనే ఉంది నాకు మొనాటనీ వచేస్తుందేమో అని భయం ఉంది కానీ నేను ఈ జానర్ నుంచి బయటకు వచ్చి వేరే సినిమాలు చేసిన అందులో కూడా ఫన్ మాత్రం మిస్ అవ్వను జెన్యూన్ గా కూడా నేను చాలా సరదాగా ఉండటనికి ఇష్టపడతాను.

ఈ సినిమా మొత్తానికి నేను ఒక సన్నివేశం లో మాత్రమే ఎమోషన్ పెట్టాలి అనుకున్నాను ఎందుకంటె ఈ కథ ఆ ఒక్క సందర్భం తప్పితే మిగిలిన చోట ఎమోషన్స్ ని కి అంతగా ప్రాధాన్యత ఉండదు. కామెడీ కమర్సియాలిటీ తో పాటు ఒక చిన్న మెసేజ్ ని కూడా సినిమాలో బ్లెండ్ చేసాము. అన్ని ఏర్చి పేర్చి సినిమాని కూర్చాము.

ఏ సినిమాకు అయినా లైన్ థిన్ గానే వుంటుంది. అందుకే దాన్ని లైన్ అంటారు. ఆ లైన్ చుట్టూ అల్లుకున్నసీన్లతో కలిపి కథ తయారవుతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా పెర్ ఫెక్ట్ బ్లెండ్. క్లాస్ మాస్ ఫన్ ఎంటర్ టైనర్. థియేటర్లలో జనాలకు నూరు శాతం సంతృప్తి ని ఇచ్చే సినిమా అంటూ తన ఇంటర్వ్యూ ముగించారు.

Share

Leave a Comment