ఆగడు హైప్‌తో సినిమా వస్తే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన దూకుడు చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పోకిరి తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్న మహేష్ కు అంతటి కిక్ ఇచ్చిన సినిమా దూకుడు. తెలుగు సినిమాల్లో అదీ యూ.ఎస్ లో 1మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన మొదటి చిత్రం దూకుడు కావడం విశేషం.

అలాంటి కాంబినేషన్ నుండీ ఓ సినిమా వస్తుందంటే ఇంకెంత హైప్ ఉంటుంది చెప్పండి. రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అని అంతా ఫిక్సయిపోయారు. ఈ క్రమంలో ఆగడు చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్, తమన్నా జంటగా నటించారు. అయితే సినిమాకు ఎంతటి హైప్ వచ్చిందంటే ఆ అంచనాలను సినిమా అసలు అందుకోలేకపోయింది.

ఆగడు సినిమా విడుదలై ఐదేళ్లు కావొస్తోంది. ఈ సందర్భంగా సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర సినిమా గురించి ట్వీట్ చేశారు. ఆగడు సినిమాకు బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఓవర్‌సీస్‌ బయ్యర్స్‌కు మంచి లాభాలను తెచ్చిపెట్టిందని తెలిపారు. ప్రీమియర్స్‌లోనే 500కె డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రమని అన్నారు.

అంటే యూ.ఎస్ లో ప్రీమియర్స్ కే హాఫ్ మిలియన్ కొల్లగొట్టిన మొదటి చిత్రం కూడా ఆగడు అనమాట. అందుకే అనిల్ సుంకర ఆగడు గురించి ఇలా పోస్ట్ చేసారు. ఇప్పుడు కానీ ఆగడు హైప్‌తో దూకుడు కంటెంట్‌తో కూడిన సినిమా ఉంటే మీరేమంటారు సూపర్ ఫ్యాన్స్ అని అనిల్ సుంకర నిన్న ట్వీట్ చేసారు. అయితే ఇక్కడ దూకుడు కంటెంట్ అంటే బ్లాక్ బస్టర్ కంటెంట్ అని అర్థం.

దూకుడు కంటెంట్ అంటే బ్లాక్ బస్టర్ కంటెంట్ అనే తప్ప దూకుడు కంటెంట్ కాదని చెప్పడం ద్వారా సరిలేరు నీకెవ్వరుకు దూకుడుకు పోలిక ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఆగడు ఫస్ట్ హాఫ్ కు వర్క్ చేశాడు. అంటే అందరూ ఈ సారి బ్లాక్‌బస్టర్ కంటెంట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారనమాట.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ గా తన కెరీర్ లో మొదటిసారిగా ఒక ఆర్మీ అధికారిగా మనకు కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. అక్కడ వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌ సెట్‌లో ఒక అదిరిపోయే యాక్సన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఈ షెడ్యూల్‌కి మంగళవారంతో ప్యాకప్‌ చెప్పారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం అవుతుంది. దేవాలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ప్లాన్‌ చేశారని సమాచారం.

అంటే కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌లో విలన్లను రప్ఫాడించిన అజయ్‌ కృష్ణ తర్వాత గుడిలో పూజలు చేయనున్నారన మాట. ఈ సన్నివేశాల కోసం హైదరాబాద్ లోని ప్రఖ్యాత గాంచిన చిలకూరు బాలాజీ దేవాలయం ను ఎంచుకున్నట్లు సమాచారం. త్వరలోనే మహేష్ ఇక్కడ చిత్రీకరించే సన్నివేశాల్లో పాలుపంచుకుంటారని సమాచారం.

నిన్నటితో సరిలేరు నీకెవ్వరు షెడ్యూల్ ముగియడంతో మహేష్ ముంబై చేరుకున్నారు. మహేష్ ముంబై ఏయిర్ పోర్ట్ లో ఉన్న ఫొటోలను బాలీవుడ్ మీడియా ప్రచురించింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబై నుంచి వచ్చాక మహేష్ మళ్ళీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తో బిజీ కానున్నారు.

Share

Leave a Comment