ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా..

ఈ ఏడాది సంక్రాంతి పండగకి సరిలేరు నీకెవ్వరూ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే సరిలేరు తనకెవ్వరు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ముఖ్యంగా ఈ సినిమాలో మైండ్ బ్లాక్ అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే మహేష్ రష్మిక కాంబినేషన్లో డాన్స్ ఇరగదీసారు. మైండ్ బ్లాక్ పాట అయితే ఊపు ఊపేసింది. ఈ పాటలో మహేష్ రష్మిక చిందులు అందర్నీ కట్టిపడేశాయి.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. గత కొంతకాలంగా తాజాగా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో దుమ్ములేపుతున్నాడు. తన భార్య క్యాండీతో కలిసి తాజాగా మైండ్ బ్లాక్ పాటకు చిందులేసి ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు.

డేవిడ్ వార్నర్ మొన్నేమో పోకిరి సినిమాలోని ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్ధో వాడే పండుగాడు అంటూ అభిమానులకు కనువిందు చేసాడు. అలా మైండ్ బ్లాక్ డైలాగ్ మరువక ముందే మైండ్ బ్లాక్ అంటూ మహేష్ పాటతో మళ్లీ సందడి చేస్తున్నాడు.

కానీ ఈసారి మాత్రం భార్య భర్తలు మైండ్ బ్లాక్ స్టెప్స్ పర్ఫెక్ట్ గా చేసాడని చెప్పవచ్చు. అయితే మునపటి సాంగ్స్ కంటే ఈ పాట కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని సుమారు 51 సార్లు ప్రయత్నిస్తేనే గానీ పర్ఫెక్షన్ రాలేదని తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు.

కరోనాతో ఇంటికే పరిమితమైన వార్నర్ టిక్టాక్లో మాత్రం దూసుకుపోతున్నాడు. తమ ఇష్టమైన హీరో పాటకు ఈ డాషింగ్ ఓపెనర్ స్టెప్స్ వేయడంతో మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమ హీరో పాటకు ఇంటర్నేషనల్ క్రికెటర్ డాన్స్ చేయడం మహేష్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇస్తుంది.

డేవిడ్ వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ఆదివారం సాయంత్రం అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ నిర్వహించిన లైవ్ చాట్ ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. డేవిడ్ వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్ కి వార్నర్ అదరగొట్టాడని కితాబిచ్చాడు.

ఈ సందర్భంగా మహేశ్‌ను ఫేవరేట్ క్రికెటర్స్ ఎవరని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి మహేశ్ బదులిస్తూ మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ , విరాట్ కోహ్లీలని బదులిచ్చాడు. కానీ తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మాత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పుకొచ్చాడు మహేశ్.

సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు కొత్త సినిమా అప్‌డేట్స్‌ ఇవ్వడం మహేశ్‌బాబు అనవాయితీ. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో చేయనున్న సినిమాకి సర్కారు వారి పాట టైటిల్‌ ప్రకటించారు. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది అని తెలిపాడు పరశురామ్‌.

Share

Leave a Comment