అద్భుతమన్న బాలయ్య

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం యన్.టి.ఆర్ కథానాయకుడు.

కథానాయకుడు సినిమాను హైదరాబాద్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు క్రిష్ చూశారు. అనంతరం సినిమా చుసి వస్తున్న బాలకృష్ణను ఏఎంబీ సినిమాస్ గురించి ఫీడ్ బ్యాక్ రాయమని కోరారు. దీనికి ఆయన ‘ఎక్సెలెంట్’ అని రాసి తన సంతకాన్ని జత చేసారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలోనే కాకుండా ఇతర సినిమాల విషయంలో కూడా సోషల్ మీడియా ద్వారా స్పందన తెలియజేస్తూ ఉంటారు. మహేష్ కు ఏ సినిమా అయినా నచ్చితే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సినిమా చూసిన వెంటనే మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లతో తన స్పందనను తెలిపారు. సినిమా అద్భుతమని డైరెక్టర్ క్రిష్ ప్రేక్షకులకు మధురానుభూతి కలిగించేలా క్యాన్వాస్ పై పెయింటింగ్ లా వేశాడని అన్నారు. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి పాత్రలో జీవించారని ప్రతి ఫ్రేమ్ లో ఆ విషయం తెలుస్తుందని అన్నారు.

అన్ని పాత్రలు చక్కగా డిజైన్ చేశారని 100 % న్యాయం చేసేలా ఆయా నటులు పోషించారని అందరినీ బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. తెలుగు సినిమాకు లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారికి ఎన్టీఆర్ కథానాయకుడు ఒక ఉత్తమ నివాళి అన్నారు. ఇక ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కంటే బెటర్ గా ఏదైనా ఉంటుందంటే అది ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అని ఆ చిత్రం కోసం వేచి చూస్తున్నానని తెలిపారు.

ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ మెంబర్స్ అందరికీ అభినందనలు తెలిపారు. మహేష్ బాబు అభినందనలకు స్పందించిన దర్శకుడు క్రిష్ “థ్యాంక్ యూ మహేష్ గారు. మీ ప్రశంసలు మా టీం అందరికీ చాలా విలువైనవి. థ్యాంక్ యూ సో మచ్” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా మహేష్ ఈ చిత్రం గురించి చేసిన మూడు ట్వీట్లను దర్శకుడు క్రిష్ తన ఖాతా నుండి రీట్వీట్ చేసారు.

ఏఎంబీ సినిమాస్ లో సినిమా చూసిన తరువాత కూడా క్రిష్ మాట్లాడుతూ మల్టీప్లెక్స్ ను ప్రశంసలతో మొంచెత్తారు. ‘ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా నేను చూశాను. కొన్ని స్క్రీన్స్ లో ఎఫెక్ట్స్ బాగా ఉండవు. కానీ, మేము ఏదైతే ఎంత గొప్పగా తీశామో అంతే గొప్పగా ఈ స్క్రీన్ లో ఉంది. ఇంకోసారి ఆ స్క్రీన్ లోనే సినిమా చూడాలి. ఈ సినిమాస్ ను నిర్మించిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు’ అని క్రిష్ చెప్పుకొచ్చారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందే మహేష్ తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు.

అనేక ప్రత్యేకతలు ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ మహర్షి పై మహేష్ అభిమానుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మాస్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ అందరూ మెచ్చేలా అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయని యూనిట్ నమ్మకంతో ఉంది.

ఇందులో మహేష్ బాబు రెండు షేడ్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. స్టూడెంట్ పాత్ర ఒకటికగా, రెండోది కంపెనీ సీఈఓ పాత్ర. స్టూడెంట్ పాత్ర కోసం మహేష్ తన లుక్ ను మార్చుకున్నాడు. ఇక మహేష్ తో పాటు ఇందులో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు.

Share

Leave a Comment