ఇదీ మహేష్ సత్తా

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కనబరుస్తోంది. మహేష్ బాబు కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా చరిత్ర సృష్టించింది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు తన అభిమానులకు బ్లాక్ బస్టర్ ప్రామిస్ ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నాడు.

సూప‌ర్ స్టార్ సినిమాకు మంచి టాక్ రావాలే కానీ వసూళ్ల మోత మామూలుగా ఉండదు. అది ‘భరత్ అనే నేను’తో మరోసారి రుజువైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

విశేషం ఏంటంటే ఈ చిత్రం ఏపిలోని చాలా ఏరియాల్లో కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఎక్కడెక్కడ కోటి రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసిందో మీరు కూడా చూడండి. విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలురు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు లలో కోటి రూపాయలను వసూలు చేసింది భరత్ అనే నేను.

1.5మిలియన్ సినిమాలు 5, 2.5మిలియన్ సినిమాలు 2, 500కె+ ప్రీమియర్స్ సినిమాలు 5 ఉన్న ఏకైక హీరో సూపర్ స్టార్ మాత్రమే. చెన్నై లో 4 70లక్షలకు పైగా గ్రాసర్లు కూడా మహేష్ సొంతం. అందుకే అతన్ని సూపర్ స్టార్ అనేది.

విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్‌లో కేవలం ఒక్క మల్టీప్లెక్సులోనే ‘భరత్ అనే నేను’ పది రోజుల వ్యవధిలో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలో కూడా రూ.కోటి గ్రాస్ ను వసూలు చేసింది. ఈ ఘనత 7వ సారి సాధించిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ మాత్రమే.

కేరళలో ఏ తెలుగు చిత్రంకు సాధ్యం కాని రీతిలో కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు భరత్. కేరళలో పది రోజులకే 1 మిలియన్ రాబట్టి హయ్యస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది భరత్ అనే నేను. తమిళనాడు లో అల్టిమేట్ రికార్డ్ కొట్టింది భరత్ అనే నేను.

తెలుగు చిత్రాలకు సంబంధించి చెన్నైలో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రాలలో ‘బాహుబలి 2’ ను వెనక్కి నెట్టి ‘భరత్ అనే నేను’ తో అల్టిమేట్ రికార్డ్ ను నెలకొల్పాడు సూపర్ స్టార్ మహేష్. చెన్నై లో డైరెక్ట్ తెలుగు వర్షన్ తో అక్కడ బాహుబలి2 1.65కోట్లని అందుకోగా భరత్ అనే నేను 1.70కోట్లని అందుకుని ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను దక్కించుకుంది.

భరత్ అనే నేను తో నాలుగవ 100కోట్ల గ్రాసర్ ని, 5 50కోట్ల షేర్ ని, 2 85కోట్ల షేర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. తెలుగు హీరోల్లో ఇదే హయ్యస్ట్. అమెరికాలో కూడా భరత్ అనే నేను తో 8వ మిలియన్ డాలర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్.

Share

Leave a Comment