‘భరత్ అనే నేను’ లేటెస్ట్ షెడ్యూల్

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ అక్టోబర్ 13 నుండి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్‌ అనే నేను’లో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు ఇండిస్టీలో మహేష్ బాబు బిజినెస్‌ స్టామినా వేరు. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా తన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ అవుతాయి. మహేశ్‌ ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌లో ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్‌ అనే నేను’ రెగ్యులర్‌ షూటింగ్‌కి కొంత విరామం ఇచ్చారు.

మహేష్ ఈ షెడ్యూల్ కు అక్టోబర్ 20 నుండి హాజరు అవుతాడని సమాచారం. ఈ సిన్మా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్‌లో మొన్నా మధ్య మహేష్, పోసాని కృష్ణమురళి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల గెటప్పుల్లో ఉన్న పలువురు ఆర్టిస్టులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తీశారు.

త్వరలో మొదలు కానున్న షెడ్యూల్‌లో మహేష్ పై ముఖ్య సన్నివేశాలు తీయనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సీయం చాంబర్‌ సెట్‌ వేస్తున్నారు. ఈ సెట్‌ వర్క్‌ ఆల్మోస్ట్‌ పూర్తి కావొచ్చిందని సమాచారం. అంటే… తాజా షెడ్యూల్‌లో ముఖ్యమంత్రిగా మహేష్ చాంబర్‌లో పాల్గొనే సన్నివేశాలు తీస్తారన్న మాట.

ఫ్యామిలీ/పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణి హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

రవి కె. చంద్రన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Share

Leave a Comment