భరత్‌ అనే నేను తాజా షెడ్యూల్

మహేష్ బాబు, కొరటాల శివ నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 15 నుండి బిగిన్ కానుంది.

కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభమైంది. ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం తదితర కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌కు గ్యాప్‌ వచ్చింది.

మహేష్ బాబు ప్రస్తుతం హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ నెల 15 నుంచి తాజా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించిన సెట్, మేకింగ్ ప్రాసెస్ లో ఉండటంతో చిన్న బ్రేక్ తీసుకున్న సినిమా యూనిట్, మరో 3 రోజుల తరవాత రెగ్యులర్ షూటింగ్ తో బిగిన్ చేయనుంది.

ఈ నెల 17 నుంచి ఈ సినిమా షూటింగులో మహేష్ బాబు కూడా జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది. ఇక షెడ్యూల్ మొద‌ల‌య్యాక ఎలాంటి గ్యాప్స్ లేకుండా ముందు చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తారట‌.

ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

‘శ్రీమంతుడు’ తరువాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీరేంజ్‌లో జరుగుతోంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేష్ కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ కాల్షీట్లు కేటాయించేశాడు. కెరీర్ 25వ సినిమా వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Share

Leave a Comment