హిందీ ఫ్యాన్స్ కి కానుక గా

మ‌హేష్ బాబు తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. ఆల్ ఓవర్ ఇండియా లో కూడా చాలా పాపులర్ అనే సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. నార్త్ లో అభిమానులు కూడా ఈయ‌న సినిమాలను భాష తెలియకపోయిన ఎగబడి చూస్తారు. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో మహేష్ సినిమాలు డ‌బ్ అయి విడుద‌ల అయినవెంటనే రికార్డు స్థాయి లో రెస్పాన్స్ ఉంటుంది అక్క‌డి ఆడియ‌న్స్ నుండి.

మన సినిమాలు మెల్లగా హిందీ ఇండస్ట్రీలో కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతున్నాయి. ఇక్కడ్నుంచి అక్కడికి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ కి ఉన్న క్రేజ్ ద్రుష్ట్యా ప్ర‌తీ సినిమా అక్క‌డ అనువాదమవుతోంది. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా కూడా రానుంది.

తాజాగా భరత్ అనే నేను సినిమా హిందీలో భరత్-ది గ్రేట్ లీడర్ పేరుతో హిందీలో డబ్ కానుంది. ఇప్పుడు ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. సాధార‌ణంగా తెలుగు సినిమాకు ఒక‌ప్పుడు హిందీలో పెద్ద‌గా మార్కెట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగా క్రేజ్ పెరిగిపోయింది. రీజనల్ బౌండరీస్ ని చెరిపి వేసి తెలుగు సినిమా మార్కెట్ ని విస్తరించిన ఘనత కూడా మహేష్ కే చెందుతుంది.

ఇప్ప‌టికే హిందీ డ‌బ్బింగ్ పూర్తైపోయింది.. ఆర్జే మూవీస్ ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో విడుద‌ల చేస్తున్నారు. అక్క‌డ వ‌స్తున్న ఇమేజ్ చూసి మ‌న సినిమాల‌కు డ‌బ్బింగ్ రైట్స్ భారీగా అమ్మేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. భ‌ర‌త్ అనే నేను సినిమా కూడా ఇలా వెళ్లిందే. దానికి టోటల్ ఇండియా వైడ్ అధ్బుతమైన స్పందన లభించింది.

విపరీతంగా లైక్ లు, కమెంట్ల వర్షం కురుస్తుంది. విడుదలైన ఒక రోజులోనే సుమారుగా 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుందంటే మాములు విషయం కాదు. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. దీని బట్టి భరత్ అనే నేను హిందీ వర్షన్ కోసం నార్త్‌ అభిమానులు ఎలా అదురు చుస్తున్నారొ అర్ధమౌతుంది.

ఇప్పుడే కాదు మహేష్ అంటే టోటల్ ఇండియా వైడ్ గా గుర్తింపు ఉంది. దటీజ్ సూపర్ స్టార్ మహేష్. ఓవర్‌సీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ప్రిన్స్ సొంతం. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలో తన ఫ్యాన్ బేస్ పటిష్టం చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. నార్తిండియాలో మన సినిమాల గురించి మాట్లాడేలా చేసిన హీరో మహేష్.

Share

Leave a Comment