బిగ్ ఎనౌన్స్ మెంట్ – ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…

ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల్లో సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. ఎంతగానో ఎదురుచూస్తున్న “భరత్ అనే నేను” సినిమాకు సంబంధించిన అఫిషియల్ న్యూస్ వచ్చింది!

అవును… ఈ పండగకు ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గానీ, మైక్రో టీజర్ గానీ విడుదల చేస్తారన్న సమాచారం ఇటీవల హల్చల్ చేసింది.

అయితే నిన్నటి వరకు దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో… ఈ ఫెస్టివల్ కి ఫస్ట్ లుక్ లేదు అని ఫిక్స్ అయిపోయిన తరుణంలో మహేష్ బాబు అఫిషియల్ టీం నుండి ఓ ట్విట్టర్ సందేశం వచ్చింది.

“సూపర్ స్టార్ మహేష్ బాబు 24 ఆన్ ది వే” అంటూ ట్యాగ్ చేస్తూ… చిత్ర ప్రొడక్షన్ యూనిట్ ‘డివివి ఎంటర్టైన్మెంట్స్’ను చూస్తూ ఉండండి… అంటూ ట్వీట్ రావడంతో మహేష్ అభిమానులకు సంక్రాంతి రెండు రోజుల ముందే వచ్చినట్లయ్యింది.

ఇంతకీ ఏది రిలీజ్ అవబోతోంది? ఎప్పుడు రిలీజ్ అవబోతోంది? అన్నది ఫ్యాన్స్ లో క్యూరియాసిటిని మరింతగా పెంచుతోంది.

మహేష్ బాబు పోస్టర్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదల కాబోతోందా? టైటిల్ ను రివీల్ చేయబోతున్నారా? లేక మరింత షాక్ ఇచ్చే విధంగా ఏకంగా ఫస్ట్ టీజర్ ను తీసుకువస్తారా?

ముందుగా అంచనా వేసింది కాకపోవడంతో… ఏది వచ్చినా ప్రిన్స్ అభిమానులకు పండగేనని చెప్పవచ్చు. ఫాన్స్ అందరు చాలా ఆతురత తో ఎదురుచూస్తున్నారు.

‘శ్రీమంతుడు’ తరహాలోనే కొరటాల మాయాజాలం మాత్రం కావాలంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. శ్రీ‌మంతుడు లాంటి ఇండ‌స్ట్రీ హిట్‌ని ఇచ్చిన జోడీ కావ‌డంతో అంచ‌నాలు తారా స్థాయిలోనే ఉన్నాయి.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

రచయితగా, దర్శకుడిగా కొరటాల శివ చిత్రాలు అంతర్లీనంగా సందేశాన్ని కలిగి ఉంటాయి. మాస్‌, కమర్షియల్‌ అంశాలను టచ్‌ చేస్తూనే అందులో సందేశానికీ ప్రాధాన్యం ఇస్తారు.

ఇప్పుడు ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా పూర్తిగా పాలిటిక్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ఇతర అంశాలపైనా డైరెక్టర్ కొరటాల శివ కేర్ తీసుకున్నాడని తెలుస్తోంది.

Share

Leave a Comment