మహేష్ గారితో షూట్ పిక్నిక్ లా ఉండేది

తాజాగా ఒక ప్రముఖ టీవీ చ్యానెల్ కి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ బాబు లేకుంటే తాను లేన‌నే విష‌యం బిగ్ బాస్ విన్నర్ కౌశ‌ల్ మరోసారి స్పష్టం చేసాడు. అంతే కాకుండా తనకి మహేష్ కి మధ్య ఉన్న అనుబంధాన్ని మరియు రాజకుమారుడు టైం లోని విశేషాలని ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.

“రాజకుమారుడు సినిమా చేసిన సమయంలో ఆయనతో ఎక్కువ సమయం గడిపాను. మహాభలేశ్వరం షూటింగులో ఆయనతో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మరిచిపోలేను. దాదాపు ఇరవై ఐదు రోజులు అవుట్ డోర్ షూటింగ్ అయింది. మేమందరం యంగ్ బ్యాచ్ ఒక ఐదుగారు ఆరుగురు ఉండేవాళ్ళం. షూటింగ్ అయిపోయిన వెంటనే మహేష్ గారి రూమ్ కి వెళ్ళి సరదాగా గడిపేవాళ్ళం.

మహేష్ గారి అమ్మమ్మ గారు ఆవకాయ పచ్చడి పంపిస్తుండేవారు. ఆ పచ్చడి టేస్ట్ చూడమని మాకు ఇచ్చేవాడు మహేష్, అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. ఇంక మహేష్ మాతో కలిసి టేబుల్ టెన్నిస్ బాగా ఆడేవాడు. ఒక షూటింగ్ లా కాకుండా చాలా సరదాగా గడిపాం ఆ నెల రోజులు.

మొత్తం ఒక పిక్నిక్ లాగా అయింది. మహేష్ ఎప్పుడూ ఒక పెద్ద సూపర్‌స్టార్ వారసుడినని గర్వంగా బిహేవ్ చేయలేదు. మాలో ఒకడిగా కలిసిపోయాడు. చాలా ఫ్రెండ్లీ గా ఉండేవాడు. మహేష్ గారు ఉంటే చాలు మొత్తం అంతా లైవ్లీ గా ఉంటుంది. ఆ చార్మ్ ఆయన సొంతం. హైద‌రాబాద్‌లో ద‌గ్గ‌రుండి మహేష్ బాబు నా చేత అక‌డ‌మీ ఏర్పాటు చేయించాడు.

నేను ఈ రోజు ఈ పొజీషన్ లో ఉండడానికి, నా మోడలింగ్ ఏజెన్సీ కి ఇండియా లోనే బెస్ట్ అని అవార్డు రావడానికి కూడా ఫుల్ క్రెడిట్స్ మహేష్ కే ఇస్తాను. నాతో మోడలింగ్ ఏజెన్సీ పెట్టించి చాలా సపోర్ట్ చేసాడు. జస్ట్ యాక్టర్ గా నే కాకుండా కాస్టింగ్ మానేజర్ గా కూడా నాకు చ్యాన్స్ ఇప్పించాడు. అందుకే మొన్న టైటిల్ గెలిచాక కూడా మహేష్ కే ఫస్ట్ థాంక్స్ చెప్పా ఆండ్ ఆయన వేసిన ట్వీట్ కి కూడా మీరే నా మొదటి ప్రిన్స్ అని రిప్లై పెట్టాను.

ఇటీవల హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగు సందర్భంగా స్పెషల్ గెస్ట్ గా వెళ్ళాను. నన్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. బిగ్ బాస్ షో వలన నేను సంపాదించుకున్న అభిమానులని ఎప్పటకీ మరిచిపోలేను. మహేష్ గారు నా కెరీర్ స్టార్టింగ్ టైం లో సపోర్ట్ చేయకపోతే నేను అనేవాడిని అసలు ఈ ఇండస్ట్రీ లోనే ఉండేవాడిని కాను ఏమో.. సో మహేష్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను” అని కౌశల్ తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి అమెరికాలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. పోయిన నెలలోనే ఆ షెడ్యూల్ ప్రారంభం కావలసి ఉన్నా ఆ షెడ్యూల్ ను వాయిదా వేసి హైదరాబాద్ లోనే షూటింగ్ కొనసాగించారు. ఈ నెలలోనే మహర్షి టీమ్ అమెరికాకు ప్రయాణం అవుతోందట. న్యూ యార్క్, న్యూ జెర్సీ తదితర నగరాలలో షూట్ జరుగుతుందని సమాచారం.

Share

Leave a Comment