సూప‌ర్‌స్టార్‌కు ప్ర‌ముఖుల బ‌ర్త్‌డే విషెస్‌

ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా ఏది ఓపెన్ చేసిన సూప‌ర్‌స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ ఈరోజు తన 43వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ దగ్గర నుండి పి.వి.సింధు, సినిమా స్టార్లు, అసంఖ్యాకంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోను విష్ చేస్తూ ముంచెత్తారు.

మహేష్ బాబు అందమైన స్టార్ మాత్రమే కాదు అందమైన మనసు ఉన్న మనిషి అంటూ ఆయన చేస్తున్న మంచి పనులను, సేవా కార్యక్రమాలను పలువురు అభిమానులు గుర్తు చేసుకున్నారు. 1975 ఆగస్టు 9న జన్మించిన మహేష్ బాబు నేటితో 43వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. తనను విష్ చేసిన వారికి మహేష్ బాబు రిప్లై ఇస్తూ ‘మీ ప్రేమ మరియు దీవెనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ రోజు నుండి నా జర్నీ ‘రిషి’గా మొదలైంది’ అన్నారు.

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో మహేష్ తో తాను దిగిన ఓ ఫోటోను పోస్టు చేశారు. ‘సూపర్‌స్టార్, నా ప్రియమైన స్నేహితుడు మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ‘హ్యాపీ బర్త్‌డే సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు’ అని మన బ్యాడ్‌మింటన్ సంచలనం పి.వి.సింధు ట్వీట్ చేశారు.

‘మ‌హేష్ అన్న‌కు జ‌న్మ‌దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. ఈ ఏడాది మీకు గొప్ప‌గా, ప్ర‌శాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బ‌ర్త్‌డే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌’ అని మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బ‌ర్త్‌డే మ‌హేష్‌. మ‌హర్షికి ఆల్ ది బెస్ట్‌’ అని నాగ‌బాబు ట్వీట్ చేశారు.

‘ఈ ‘రవి’ నుంచి ‘రిషి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సర్‌. ‘మహర్షి’ సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో మైలురాయి’ అని అల్ల‌రి న‌రేష్‌ ట్వీట్ చేశారు. ‘ మా రిషికి హ్యాపీ బర్త్‌డే. గోవాలో కలుద్దాం, లెట్స్ కిల్ ఇట్. అప్పటి దాకా పార్టీ హార్డ్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే ఎహెడ్’ అని పూజా హెగ్డే ట్వీట్ చేశారు.

‘హ్యాపీ బర్త్‌డే ఎవర్‌గ్రీన్‌ వన్‌ అండ్‌ ఓన్లీ మహేష్ బాబు. బ్లాక్‌బస్టర్‌ సినిమాతో మీకు ఈ ఏడాది ప్రారంభం కావాలని ఆశిస్తున్నాను’ అని రకుల్‌ ప్రీత్‌ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే టు ది మోస్ట్ హంబుల్ సూప‌ర్‌స్టార్, యాన్ యాక్టర్ పార్ ఎక్సెలెన్స్ అండ్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ మహేష్ సర్. విషింగ్ యూ ది బెస్ట్ ఆల్వేస్’ అని కియరా అడ్వాణీ ట్వీట్ చేశారు.

‘చిరునవ్వుతో సామ్రాజ్యాలు జయించగల చక్కనయ్య. సూపర్ స్టార్ కి నటనలో, మంచితనంలో నిజమైన వారసుడు. నిజాయితీలో శ్రీమంతుడు. మా మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతు. సామాన్యంగా మహేష్ బాబుని చూస్తే ఆడపిల్లలు తలతిప్పి చూస్తారు. మహేష్ బాబే అమ్మాయిని చూసి తలతిప్పి చూసాడంటే, ఈ మీసం వున్న మహర్షి మాములుగా వుండడనుకుంటా’ అని పరుచూరి గోపాలకృష్ణ గారు ట్వీట్ చేశారు.

‘సూపర్‌స్టార్‌ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘మహర్షి’ ఫస్ట్‌లుక్‌ అదిరింది’ అని గోపీచంద్‌ మలినేని ట్వీట్ చేశారు. ‘అన్నా ఫస్ట్‌లుక్‌ అదిరింది. హ్యాపీ బర్త్‌డే మహేష్ గారు’ అని అనిల్‌ రావిపూడి ట్వీట్ చేశారు. ‘మన సూపర్‌స్టార్‌ మహేష్ కు పుట్టినరోజు శుభాకంక్షలు. ‘మహర్షి’ లుక్‌ అదిరింది’ అని మారుతి ట్వీట్ చేశారు.

‘మ‌నోజ్ అనే నేను మ‌హేష్ అనే సూప‌ర్‌స్టార్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియ‌ప‌రుస్తూ సెల‌వు తీసుకుంటున్నాను. జైహింద్‌. గెడ్డం అదుర్స్ అన్నా’ అని మంచు మ‌నోజ్‌ ట్వీట్ చేశారు. ‘వావ్‌ ఫస్ట్‌లుక్‌లో ఫ్రెష్‌గా, ఛార్మింగ్‌గా కనిపిస్తున్నారు. ఈ హ్యాండ్సమ్‌ స్టూడెంట్‌కు హ్యాపీ బర్త్‌డే’ అని సుశాంత్‌ ట్వీట్ చేశారు. ‘టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో హ్యాండ్సమ్‌ ప్రిన్స్‌ మహేష్ బాబుకు హ్యాపీ బర్త్‌డే’ అని ఈషా రెబ్బా ట్వీట్ చేశారు.

Share

Leave a Comment