కేవలం మహేష్ మాత్రమే చేయగలడు

తెలుగు సినీ పరిశ్రమలో మొదట్లో రఫ్ అండ్ టఫ్ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. కానీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి అభినయం ప్రదర్శించారు. తన నటన ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటుడు సుబ్బరాజు. మధ్యలో కొంచెం సినిమాలు తగ్గించినా రీసెంట్ గా మంచి పాత్రలు చేసి అందరి మన్ననలను అందుకున్నారు.

మహేష్ తో ఉన్న అనుభంధం గురించి మహేష్ కి నటన పట్ల ఉన్న డెడికేషన్ గురించి సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. “మహేష్ సూపర్‌స్టార్ అయిన కూడా ఎంతో కష్టపడతాడు, అంత స్టార్ స్టాటస్ లో ఉండి కూడా ఇంక అంత సాధాసీధా గా ఉండే అతి తక్కువ నటుల్లో మహేష్ ముందు వరస లో ఉంటాడు.

ఆయనకి ఏదైన యాక్షన్ సీన్ లో దెబ్బ తగిలినా, కోసుకుని రక్తం వస్తున్నా కూడా ఆ పర్లేదు అని తుడుచేసుకుని షాట్ కి రెడీ సార్ అంటారు. అంత నిబద్దతో పని చేస్తాడు. దూకాలంటే సరే ఇంకోసారి దూకేద్దాం అని రెడీ అయిపోతాడు. టోటల్ గా డైరక్టర్స్ యాక్టర్, సినిమా కోసం ఏమైన చేస్తారు ఆయన. నేను చాలా సార్లు చూసాను.

మహేష్ ని పోకిరి నుంచి చూస్తున్నాను, ఇంకా అదే డెడికేషన్ లెవెల్. చాలా మొండి గా పనిచేస్తారు ఆయన. చూడడానికి మాత్రం చాకలెట్ బాయ్ లా ఉంటాడు, చాలా సెన్సిటివ్ ఏమో అనుకుంటారు అందరూ..కనపడడానికి అలా ఉంటారు కాని ఏమైన అనుకుంటే అది పూర్తి చేసేవరకు శ్రమిస్తారు.

ఇంత కమిట్మెంట్ తో వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందులోను సూపర్‌స్టార్ స్టేటస్ లో ఉంటూ కూడా ఇంకా ఇంత డెడికేషన్ తో ఉండడం మహేష్ కే సాధ్యం. నేను అమితంగా అభిమానించే నటులలో సూపర్‌స్టార్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటారు.. అది నటన పరంగా మరియు వ్యక్తిగత కారెక్టర్ పరంగా కూడా. మహేష్ ఈజ్ ధి బెస్ట్” అని అన్నారు.

మహేష్ బాబు తెలుగులో మాత్రమే సూపర్ స్టార్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మహేష్ ఫాలోయింగ్ సౌత్ అంతా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. సోషల్ మీడియా లో సౌత్ మొత్తం లో టాప్ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీగా రికార్డు సాధించారు. ప్రస్తుతం 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.

Share

Leave a Comment