ఫార్ములాను బ్రేక్ చేసిన క్లాసిక్

కొన్ని చిత్రాలు చలనచిత్ర రంగంలో పాఠ్య పుస్తకాలుగా నిలిచిపోయాయి. తెలుగు లో ఇప్పటివరకూ ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి కాని సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన అతడు మాత్రం క్లాసిక్ గా నిలిచిపోతుంది. తెలుగు చలనచిత్ర గ్రంథాలయంలో చెక్కు చెదరని, చెదలు పట్టని ఓ పుస్తకం లాంటిది అతడు.

తెలుగు సినిమాలలో హీరోయిజం అంటే అప్పటి వరకు పెద్ద పెద్ద సంభాషణలు, అరుపులు ఉండేవి. అతడు తో తెలుగు సినిమా టేకింగ్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మహేష్ తన నట విశ్వరూపం చూపించాడు. అరుపులు కేకలు లేకుండా హావ భావాలలో ఇంటెన్సిటీ పలికించి ఎంత గొప్ప నటుడో తెలియజేసాడు. త్రివిక్రమ్ వాటితో మరింత మాయ చేశాడు.

అతడు చిత్రం ఎందరో మనసులకి హత్తుకుంది. ఇప్పటికీ బుల్లితెర పై వస్తే చూసేవారు చాలా మంది ఉన్నారు. ఈ చిత్రంలోని సంభాషణల గురించి మాట్లడుకోనివారు,వారి జీవితాల్లో జరిగే సంఘటనలకు ఆపాదించుకోని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. క్లీన్ ఎంటర్‌టైన్మెంట్ అంటే ఇలా ఉండాలి అని అందరి మన్ననలను పొందిన చిత్రంగా నిలిచింది.

అతడు కథ లో ఏ ఒక్క సన్నివేశం బోరు కొట్టదు, అలాగని పరిమితి కుడా దాటదు. తక్కువ మాట్లాడుతూ ఉండే నందు పాత్రని అద్భుతంగా పోషించాడు మహేష్. ముఖ్యంగా చిత్రం మొదట్లో ఒక వ్యక్తిని చంపి పారిపోతున్న నందు చిన్నప్పటి పాత్రను చూపిస్తూ వేసిన ప్రదేశం తాలూకు వివరం ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది.

ఈ చితంలోని కథకి, కథనానికి అత్యంత బలాన్ని ఇచ్చింది మాటలే అని చెప్పాలి. మహేష్ బాబు నందు పాత్రకు ఎక్కువ మాటలు లేవు కానీ పలికిన కొన్ని మాటలు కూడా తూటాల్లా పేలాయి. ఈ చిత్రం లో ప్రతి ఒక్క డైలాగ్ ఎంతో అర్ధవంతంగా ఉంటాయి. చెప్పాలంటే ఇందులో ప్రతి మాటను గురించి చెప్పాలి కానీ అది సాధ్యపడదు కాబట్టి కొన్ని మాటల గురించి చూద్దాం:

– నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. గన్ను చూడలనుకోండి తప్పు లేదు.. కానీ బుల్లెట్ చూడలనుకోవద్దు చచ్చిపోతారు… నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోవట్లేదా అని చూస్తున్నావ్! నేను అదే తలుపుకి అవతల నిల్చొని ఎప్పుడు తెరుచుకుంటుందా అని చూస్తున్నాను.

– అబద్దం మాత్రమే ఆడాను. మోసం చెయ్యలేదు. అబద్ధం చెప్పడం నేరం, దాన్ని నిజం చెయ్యాలనుకోడం మోసం. ఈ వయసులో నాకు కావల్సిందీ నిజాలు కావు, జ్ఞాపకాలు. అవి నీ వల్ల నాకు చాలా ఉన్నాయి. గెలిస్తే రా… లేకుంటే నువ్ ఏమై పొయావన్న నిజాన్ని నాకు తెలియనివ్వకు..

– ఎవరైనా కోపం గా కొడతారూ లేకా బలంగా కొడతారూ వీడేమిట్రా? చాల శ్రద్దగా కొట్టాడూ? ఏదో గోడ కడుతున్నట్టూ , గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టూ చాలా శ్రద్దగా , పద్దతిగా కొట్టాడ్రా బుజ్జే. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుంది! మరి పులినే వేటాడాలంటే ఎంత ఓపిక కావాలి చెప్పు!

– సార్! బ్యాగ్ బాగా చినిగిపోయింది సార్! మీరు ఈల వేస్తే హీరోలు పుడతారు. మీరు ఓటు వేస్తే నాయకులు పుడతారు. మీరు అవును అన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. పాపం అమ్మ వాళ్ళు వీణ్ణి కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు, చాలా కంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్లకి!

– నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయ్యలనుకోవటం మోసం! మనల్ని చంపాలనుకునేవాడిని చంపడం యుద్ధం, మనల్ని కావాలనుకునే వాళ్ళని చంపడం నేరం. మనల్ని మోసం చేయాలనుకునేవాడిని చంపడం న్యాయం! నువ్వు మోసం చేసావు..నేను న్యాయం చేస్తాను..

– వాడోస్తాడని నేను పన్నెండేళ్ళ నుంచి చూస్తున్నాను. నేను మాట్లడతనేమోనని ఇంకో పది నిమిషాలు చుడలేడమ్మా వాడు? రోజులు గడిస్తే ఇలాంటివి మర్చిపోతాం అంటారు అందరూ. కానీ మర్చిపోవటానికి వాడేమైనా జ్ఞాపకమా? నా జీవితం!

– నువ్వేం బాధపదకు పూరీ, నువ్వేం వాళ్ళందరూ అనుకున్నంత అందంగా లేవు. మీ వాళ్ళంతా అనడం వల్ల నీకలా అనిపిస్తుంది గానీ అంతేం లేదు పూరీ. ముక్కు మరీ ఇంత ఉంటుంది. పెద్దగా కలర్ కూడా కాదు కదా. ఇంకేంటీ ప్రోబ్లం? నువ్ ధర్యంగా కిందకెళ్ళూ. ఎవడు బాగున్నవ్ అంటాడో చూస్తాను?

– ఈయన నైవేద్యం పెడితే కానీ భోంచెయ్యడం రాని రాముడు ఈయన కస్టాలు ఏం తీరుస్తాడు చెప్పు! పదేళ్ళకే అన్ని చూసేస్తే పాతికేళ్ళకు టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు? ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ వాడితో పెట్టుకోకురా బుజ్జి పరువు పోద్ది!

ఇలా అందరి మనసులని కొల్లగొట్టి అప్పటివరకు వస్తున్న రొటీన్ ఫార్ములా బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన ఈ చిత్రం లో కొన్ని సీన్స్ సమయాభావం వల్ల సినిమా నిడివి పెరుగుతుందని ఫైనల్ కాపీ నుంచి తొలగించారు. ఆ సీన్స్ కూడా చలా బావుంటాయి. అవి కూడా డీవీడీ లో పెట్టి ఉంటే ఇంకా బావుండేది అని అందరూ ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు.

తెలుగు తెర పై ఎప్పటికి నిలిచిపోయే, చెదలు పట్టని మొదటి పుస్తకం 1957 లో విడుదల అయిన “మాయాబజార్”. ప్రతి తరంలో ఇలాంటి ఒక గొప్ప చిత్రం వస్తూనే ఉంది.. నేట్ తరం లో “అతడు” అప్పటివరకు తెలుగు చిత్ర సీమ ఫాలో అవుతున్న పంధాని మార్చి ఒక కొత్త రకమైన ఫిల్మ్ మేకింగ్ కి నాంది పలికింది.

Share

Leave a Comment