మరో సంచలనానికి తెర తీసినట్లే

టాలీవుడ్ తీరు మారుతోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు డిఫరెంట్ మూవీస్ కు ప్లానింగ్ జరుగుతోంది. క్రేజీ కాంబినేషన్లు ఓకే కావాలే కానీ.. ఎంత పెట్టుబడులు పెట్టడానికి సైతం నిర్మాతలు సిద్ధమవుతున్నారు. మార్కెట్ విస్తృతి కావటం దీనికి ప్రధమ కారణం.

మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు మహేష్ ఓకే చెప్పారు. ఇదిలా ఉంటే.. మహేష్ 27వ సినిమా ఎవరిదన్న దానిపై పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ 27వ సినిమా అల్లుఅరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంచలన దర్శకుడు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తారని చెబుతున్నారు. దీనికి మహేష్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే..ఈ సినిమా సంచలనంగా మారుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ మెగా హీరోలతో కాకుండా.. మరే స్టార్ హీరోతో పెద్ద సినిమా తీయని అల్లు అరవింద్ తన స్టైల్ కు భిన్నంగా ప్రిన్స్ తో మూవీకి ఓకే చెప్పటం అంటే.. మరో సంచలనానికి తెర తీసినట్లేనని చెప్పకతప్పదు. మరి.. ఈ న్యూస్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతేడాదే వీళ్ల మధ్య మీటింగ్ జరిగింది. కథా చర్చలు కూడా సాగాయి. మహేష్ కు సూటయ్యే ఓ లైన్ కూడా వంగా చెప్పగా స్క్రిప్ట్ పనులు పూర్తిచేయాలని కోరాడట. సందీప్ ఆల్రెడీ హిందీ అర్జున్ రెడ్డి కి కమిట్మెంట్ ఇవ్వగా, మహేష్ వంశీ పైడిపల్లి, సుకుమార్‌ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం దాదాపు ఖాయం.

వచ్చే ఏడాది సందీప్ మహేష్ కోసం తిరిగి టాలీవుడ్‌కు వస్తాడన్నమాట. మధ్య మధ్యలో మహేష్ సినిమా మీద పని చేస్తూ ప్రిన్స్ ఖాళీ అయ్యే సమయానికి అతను స్క్రిప్టుతో రెడీగా ఉంటాడట. ప్రస్తుతం మహేష్ బాబు 25 వ చిత్రం మరో షెడ్యూల్ ను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోది. తర్వాతి షెడ్యూల్ న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ వెగాస్ తదితర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో యూఎస్ఏ షెడ్యూల్ ప్రారంభం కాబోతోందట.

Share

Leave a Comment