అదిరిపోనున్న భరత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ కావడానికి సర్వం సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఇదివరకే వచ్చిన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు కూడా ఇదివరకే రిలీజవ్వగా సూపర్ హిట్ ఆల్బమ్ గా టాప్ లిస్ట్ లో చేరిపోయింది.

ఇక తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఆ ఇంటరిస్టింగ్ విశేషాలు మీకోసం…

దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రాయల్ ఫీల్ ను తీసుకొస్తుంది. దీనికోసం చాలా రకాల స్ట్రింగ్స్ ను, వింగ్ స్త్రింగ్స్, బ్రాస్ వంటి పరికరాలతో మ్యూజిక్ చేసాం.

సౌండింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు ఆ అనుభూతికి లోనవుతారు. భరత్ అనే నేను కు కంపోజ్ చేయటం తనకు ప్రొఫెషనల్ గా చాలా సంత్రుప్తిని ఇచ్చిందని దేవి తెలిపారు.

సినిమాలో ఐ డోంట్ నో పాట గురించి చెప్తూ గతంలో వన్ నేనొక్కడినే సినిమాలో హూ అర్ యు పాటను ఫర్హాన్ అక్తర్ పాడాల్సింది. కానీ అప్పట్లో ఫర్హాన్ బిజీ వల్ల, పైగా తనకు భాష ప్రోబ్లం వల్ల కుదరలేదు.

ఇప్పుడు కుదిరింది అని తెలిపారు. ఐ డోంట్ నో పాటలో ఇంగ్లిష్ లిరిక్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఒప్పించాను. అలాగే తన రీసెంట్ హిట్ రంగస్థలం సినిమాకు దీనికి చాలా వ్యత్యాసమైన సంగీతం ఉంటుందని చెప్పారు.

Share

Leave a Comment