బాగా రిలేట్ అవుతారు

ఈ సంవత్సరం మహేష్ బాబు కెరీర్ పరంగా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే తన సిల్వర్ జూబిలీ చిత్రం మహర్షి ఈ వేసవి లో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకోవడంతో పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను కూడా మొదలెట్టేశారు.

ఇంతవరకు మహర్షి సినిమా ఎలా ఉంటుందో అన్న విషయం మాత్రం ఎక్కడ బయట రాలేదు. కానీ నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో సినిమా ఎలా ఉండబోతుంది అని ఓ హింట్ ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమి చెప్పారు?

మహర్షి సినిమా చూసి బయటికి వచ్చేవారు బరువైన హృదయంతో బయటకు వస్తారు అని చెప్పారు. ఈ మూవీ మహేష్ పర్సనల్ లైఫ్ కి దగ్గరకు ఉంటుందని.. ఫామిలీ ఎమోషన్స్ , ఫ్రెండ్ షిప్ లో ఉండే ఎమోషన్ తో పాటు సొసైటీ లో ఉండే ఎమోషన్ అన్ని మహర్షి సినిమాలో ఉంటున్నాయని రాజు గారు అంటున్నారు.

మహర్షి సినిమా ఒక మ్యాజిక్ లాగా అందరికీ ఎక్కేసే సబ్జెక్ట్ అని చెప్పారు.. పైగా మహేష్ 25వ సినిమా అయినంత మాత్రాన ఆడాలంటే ఆడదు. సినిమా అద్భుతంగా వస్తుంది కబట్టే ఇలా చెప్తున్నాను. వంశీ స్క్రిప్ట్ ని రెడీ చేసిన విధానం, మహేష్ బాబు క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు చాలా ఇంప్రెస్సింగ్ గా ఉంది. ప్రేక్షకుల కోణం నుంచి చూస్తే మహర్షి కి బాగా రిలేట్ అయిపోతారు.

అసలు మహర్షి ఎవరు? సొసైటీలో మనం మహర్షి అని ఎవరిని పిలుస్తాం? సినిమా లో మహేష్ ఎందుకు మహర్షి గా మారుతారు? అదే కధ…ఎలా అనేది సినిమాలో చూడాలని.. సినిమా పరంగా స్టోరీ రివీల్ చేయలేను. ఆ మ్యాజిక్ ను మీరు ధియేటర్లోనే చూడాలి అంటున్నారు దిల్ రాజు.

అంటే ఇది టోటల్ గా ఫీల్ గుడ్ మూవీ అని అర్ధం అవుతుంది. మహర్షి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు దిల్ రాజు. ఏ సినిమా అయినా మామూలుగా సక్సెస్ అవుతుందనే ఆయా చిత్రాల నిర్మాతలు చెప్పుకుంటారు. కాని తన సినిమాల విషయంలో అతిగా స్పందించని రాజు గారు సైతం మహర్షి గురించి చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు.

అంతే కాకుండా రాజు గారు మాట్లాడుతూ, ఎప్పటికైన ఒక్కడు లాంటి స్క్రిప్ట్ తో సినిమా తీయాలి అనుకునేవాడినని..ఇటువంటి కథలు చాలా అరుదుగా వస్తాయని..ఒక్కడు సినిమా చూసినప్పటినుండి ఆ కోరిక అలానే ఉండిపోయింది అని కానీ ఇంకా అలాంటి స్క్రిప్టు ఏది తనకి కనెక్ట్ అవ్వలేదు అని పేర్కొన్నారు.

బలమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న మహర్షి సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. అలాగే హీరోయిన్ పూజ సైతం తన రోల్ చలా కొత్తగా బావుంటుందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. చాలా బబ్లీ, ఫన్ లవింగ్ క్యారెక్టర్ ను పోషిస్తున్నాను. నేను ఎప్పుడూ అటువంటి అమాయకమైన క్యారెక్టర్ చేయలేదు అన్నారు పూజ.

ఇటీవల మహర్షి చిత్రానికి సంబంధించి డబ్బింగ్ ప్రారంభమైంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫోటోలలో అల్లరి నరేష్ గడ్డంతో ఉన్న పిక్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, మహేష్ స్నేహితుడు.. రవి పాత్రలో కనిపించబోతున్నాడని గతంలో వార్తలొచ్చాయి. ఈ కొత్త లుక్ సినిమా కోసమే అని అభిమానులు చర్చింకుంటున్నారు.

మహర్షి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో జరుగుతుంది. ఈ నెల 14 వరకు ఇక్కడ షూటింగ్ కొనసాగనుందని సమాచారం. సూపర్ స్టార్ సినిమా అంటే మనసుకు హత్తుకునే సన్నివేసాలతో పాటు గా అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ఆశిస్తారు సినీ అభిమానులు.

యాక్షన్ సన్నివేశాల్లో మహేష్ ఇంటెన్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ ను యాక్షన్ సీన్స్ లో ఎలా చూపిస్తాడో అని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో వేసిన సెట్ లో ఈ సన్నివేసాలు చిత్రీకరిస్తున్నట్టు వినికిడి.

ఈ సినిమా టీజర్ ను అతి త్వరలో మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తారన్న వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్‌ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసేట్టుగా ఈ టీజర్‌ ఉండనుందని సమాచారం. టీజర్ విడుదల తేదీ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నది. ఇందులో మహేష్ ట్రేడ్ మార్క్ షాట్స్ ఉంటాయని సోషల్ మీడియా టాక్.

Share

Leave a Comment