లేటయినా రావడం పక్కా..

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్‌ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపించాయి.

ఆ సమయంలో ప్రతీ వేడుకలోనూ మహేష్‌తో పాటు వంశీ పైడిపల్లి కూడా కనిపించాడు. అయితే సరిలేరు నీకెవ్వరు తరువాత కొన్ని మార్పులు నెలకొన్నాయి. అప్పటి వంశీతో అనుకున్న సినిమా ను మహేష్ పక్కన పెట్టాడని ఒక్కసారిగా మీడియా లో వార్తలు వచ్చాయి.

అదే సమయంలో పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్ సినిమా అంటూ మరో న్యూస్ తెర మీదకు వచ్చింది. దీంతో వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్వాయిదా పడిందన్న వార్తకు మరింత బలం చేకూరినట్టైంది. మహర్షి లాంటి బ్లాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వంశీతో మహేష్ మరో సినిమా చేస్తాడా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా ఈ వార్తలపై వంశీ పైడిపల్లి స్పందించాడు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో మహేష్ మూవీపై క్లారిటీ ఇచ్చాడు. మహేష్ తో తన మూవీ రద్దు కాలేదని ఈ మధ్య వస్తున్న అలాంటి వార్తలలో నిజం లేదని వంశీ పైడిపల్లి అన్నారు.

కొంచెం లేటవుతుంది కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతుందని వంశీ పైడిపల్లి అన్నారు. దీనితో మీడియా లో ఇప్పటి వరకు వచ్చిన పుకార్లకు, కథనాలకు చెక్ పెట్టినట్లైంది.

తామిద్దరి మధ్య ఉన్న బందం ఎంతో ప్రత్యేకమైనది అని తప్పకుండా మా కాంబినేషన్ లో మరొక సినిమా రానుందని తెలిపారు. అదే సమయంలో మహేష్ తో మూవీ కోసం అభిమానుల్లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పాడు వంశీ పైడిపల్లి.

మహేష్‌తో రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఏడాదిన్నరకు పైగా సమయం ఉంది. అలాగే నెక్స్ట్ మహేష్ మూవీ పరుశురాం తో మొదలుకానుండగా, ఆ తరువాత మహేష్ మరొక సినిమా చేసే ఆస్కారం ఉంది. సో అన్ని అనుకునంట్టూ జరిగితే ఈ గ్యాప్ లో మరోసారి మహర్షి కాంబినేషన్ మనల్ని ఎంటర్టైన్ చేయనున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పరుశురాం సినిమా సరికొత్త కధతో మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయని పరశురామ్ చెప్పారు. ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నానని తెలిపారు. ఇది మంచి సబ్జెక్ట్ అని చాలా మంచి సినిమా అవుతుందని నవరసాలు ఉంటాయని వివరించారు.

Share

Leave a Comment