సూపర్‌స్టార్‌తో ఎలా కాదనగలను

అందం, అభినయం, సౌకుమార్యం కలబోస్తే కియారా అడ్వాణీ. అందుకే అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో అవకాశాలు కొట్టేస్తోంది. గతేడాది ‘భరత్‌ అనే నేను’లో వసుమతిగా నటించి తన అందాలతో తెలుగు కుర్రాళ్ల మతులు పోగొట్టిన కియారా ఇప్పుడు ‘వినయ విధేయ రామ’లో సీతగా మన ముందుకు వచ్చారు.

కళ్లతోనే ఎన్నో భావాల్ని పలికిస్తూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొంటున్న కియారా తన చదువు, కుటుంబం, కెరీర్‌ గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘కెరీర్‌ ప్రారంభంలో ‘ధోనీ’లాంటి సినిమా దొరకడం నిజంగా నా అదృష్టం. ఆ సినిమా తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లోకీ అనువాదమైంది. అలా ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చింది.

బాలీవుడ్‌లో నటిగా కెరీర్‌ ప్రారంభించాక మహేష్‌ బాబు భార్య నమ్రత పరిచయం అయ్యారు. ‘భరత్‌ అనే నేను’లోని వసుమతి క్యారెక్టర్‌కి నేను సరిపోతానని భావించి ఆ సినిమా దర్శకుడు కొరటాల శివగారికి నా గురించి చెప్పారు. శివగారు ముంబయి వచ్చి నన్ను చూసి, కథ వినిపించారు. వాళ్లకి నేను నచ్చాను.

నాకు కథ నచ్చింది. అలా దక్షిణాదిలో కనిపించే అవకాశం వచ్చింది. అన్నింటికంటే సూపర్‌స్టార్‌ మహేష్‌తో సినిమా అన్నాక ఎలా కాదనగలను! మహేష్‌గారి సినిమాలతోపాటు శివగారి సినిమాల్నీ అదివరకు చూడటంతో ప్రాజెక్టుమీద నాకు పూర్తి నమ్మకంగా ఉండేది. ఆ ప్రాజెక్టు ఒప్పుకున్నాక చాలా తెలుగు సినిమాలు చూశాను.

వాటిలో నచ్చిన పదాల్ని పలకడం ప్రాక్టీసు చేసేదాన్ని. డైలాగులు కూడా ముందే తెప్పించుకుని ప్రాక్టీసుచేసేదాన్ని. వీటన్నింటివల్ల సెట్‌లో ఎలాంటి ఇబ్బందీ పడలేదు. ప్రశాంతంగా పాత్రమీద దృష్టిపెట్టే అవకాశం వచ్చింది. తానో సూపర్‌స్టార్‌ అన్న ఫీలింగ్‌ మహేష్‌లో అస్సలు కనిపించదు. టీమ్‌లో అందరితో కలిసిపోతారు.

నవ్వుతూ జోకులు పేల్చుతూ ఉంటారు. సెట్‌లో నమ్రత, సితార మంచి స్నేహితులయ్యారు. వారు నాకోసం భోజనం పంపేవారు. మహేష్ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ హీరో. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుండడంతో నమ్రత, మహేష్‌బాబు, ఉపాసన, రామ్‌చరణ్‌లతో కుటుంబం తరహా సంబంధాలు ఏర్పడ్డాయి. చాలావరకు సినిమా చిత్రీకరణ సమయాల్లో వాళ్లింటి వంటలే తిన్నా.

‘భరత్‌ అనే నేను’తో వసుమతిగా ప్రేక్షకులకి దగ్గరయ్యాను. సీత పాత్ర అలాంటి ప్రభావమే చూపిస్తుందని నా నమ్మకం. మహేష్ బాబు లాంటి హీరో తో నా ముదటి సినిమా చాన్స్ రావడం నిజంగా చాలా గొప్ప అవకాశం, ఇంకా చెప్పాలంటే గ్రేట్ ఫుల్. చాలా స్పెషల్ అసలు. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ నా మీద చాలా ప్రేమ చూపించారు. అందరికి చాలా థ్యాంక్స్.

మహేష్ సర్ తో నటిస్తున్నప్పుడు ఒక్క మూమెంట్ చెప్పమంటే చాలా కష్టం. చాలా ఉన్నాయి. మహేష్ వంటి స్టార్ హీరోని చూడలేదు. మహేష్ ఉంటే సెట్ లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన పాత్రల్లో లీనమయ్యే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్లు వచ్చినా టాలీవుడ్ ను వదిలేది లేదు’ అని చెప్పారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. రిషి పాత్రలో మహేష్, రవి పాత్రలో ‘అల్లరి’ నరేష్ కనిపిస్తారు. మహర్షి షూటింగ్ నిరాటంకంగా జరుగుతోంది. అనేక ప్రత్యేకతలు ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ మహర్షి పై మహేష్ అభిమానుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు.

అసలే సూపర్‌స్టార్ 25 వ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 2019 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మహర్షి. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Share

Leave a Comment