డబుల్ బొనాంజా !

జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబుది ప్రత్యేక స్థానం. కొత్త సంవ‌త్స‌రం మ‌హేష్‌ కి కెరీర్ ప‌రంగా క‌లిసొస్తుంద‌నే అంచ‌నాలేర్ప‌డ్డాయి.

ఎందుకంటే ఒకే ఏడాదిలో మ‌హేష్ న‌టించే రెండు క్రేజీ సినిమాలు 2018లో రిలీజ్ కానున్నాయి. ఒకే ఏడాది మ‌హేష్ ఫ్యాన్స్‌కి డ‌బుల్ ధ‌మాకా షురూ అయ్యింది.

హిట్లకు ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమా సినిమా కి క్రేజ్ ని పెంచుకునే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ ఒకరు.

మహేష్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నెక్ష్ట్ సినిమాలపై ఏ మాత్రం ప్రభావం చూపదు అని చెప్పడం లొ ఏ సందేహం లేదు.

మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది. కానీ పరాజయాలు కూడా మహేష్‌ స్థాయిని పెంచుతుంటాయి.

ఇప్పుడే కాదు… మొదట్నుంచీ కూడా మహేష్‌ జయాపజయాలతో సంబంధం లేకుండా సత్తా చాటుతుంటారు. ఈ సూపర్ స్టార్ నెక్ష్ట్ సినిమాల పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

శ్రీమంతుడుతో తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మరోసారి చేతులు కలిపాడు. మొన్నటిదాకా దీనికి బ్రేక్ ఇచ్చి హాలిడే వెకేషన్ కోసం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ బాబు ఫ్యామిలీతో సహా నిన్న రాత్రి తిరిగి వచ్చేసాడు.

సోమవారం నుంచి కొత్త షెడ్యూల్ లో మహేష్ పాల్గోనున్నాడు. ఈ సినిమాను వేసవి కానుకగా 2018 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదే హుషారులో మ‌హేష్ మ‌రో భారీ చిత్రంలో న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. వంశీ పైడిప‌ల్లితో మ‌హేష్ 25 వ సినిమా సెట్స్‌కెళ్ల‌నుంది.

ఫిబ్రవరి/మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళుతోంది. ఇప్ప‌టికే న్యూయార్క్‌లో లొకేష‌న్ల వేట సాగించార‌ని తెలుస్తోంది.

అశ్వనీదత్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను 2018 లో షూటింగ్ స్టార్ట్ చేసి అదే సంవత్సరం విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ అసలు ప్లాన్.

అంటే మహేష్ 2018 లో కొరటాల మూవీని, వంశీ మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడన్నమాట. అంటే మహేష్ అభిమానులకు మహేష్ డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నాడన్నమాట.

ఒకే ఏడాదిలో కొన్ని నెలల గ్యాప్‌లో మహేష్ బాబు వరుస చిత్రాలు రానుండటంతో మహేష్ ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి.

Share

Leave a Comment