ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుసగా రెండు వందల కోట్లు కొల్లగొడుతూ వస్తున్న మహేష్ ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో బాక్సాఫీస్‌ను ఒక రేంజి లో షేక్ చేశాడు.

ఈ మధ్య విశ్రాంతి తీసుకున్న మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనేక రకాలు వార్తలు పుట్టుకొస్తున్నాయి. మహేష్ 27వ చిత్రంను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా కొంత కాలంగా వార్తలు వచ్చాయి.

కాని మళ్ళీ ఈ మధ్య వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించడం లేదు అంటూ కొత్త వార్తలు వస్తున్నాయి. మహేష్ 27వ చిత్రంను గీత గోవిందం ఫేం పరుశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడని, పరశురామ్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో మహేష్ బాబు ఒకే చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారట.

చాలా స్పీడ్ గా ఈ సినిమాను పూర్తి చేయన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఆ మధ్య విశాఖపట్నం దగ్గరలోని అడివివరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నాడు పరశురామ్‌. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మహేష్‌తో చేయబోయే సినిమాకు కథ సిద్ధంగా ఉందన్న పరశురామ్‌ వెంటనే మహేష్ సినిమాను ప్రారంభిస్తానని తెలిపాడు. ఎప్పుడూ కథా బలాన్నే నమ్ముతాడనడం లో సందేహం లేదు. శ్రీమంతుడు చిత్రంలో ఊళ్ళను దత్తత తీసుకొని అక్కడి వారి కష్టాలు ఎలా తీర్చాలో అన్న కాన్సెప్ట్ అదిరిపోయింది.

భరత్ అనే నేను ప్రజల నమ్మకాన్ని డబ్బు తో కాదు అభివృద్ది చూపించి గెల్చుకోవాలన్న కాన్సెప్ట్ సూపర్ గా ఉంది. మహర్షి రైతంటే సింపథీ కాదు రెస్పెక్ట్ అనే సోషల్ మెసేజ్‌తో చాలా మందిలో చైతన్యం తీసుకువచ్చింది.

సినిమా అంటే కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు సమాజంలో మంచి మార్పు తెచ్చేలా ఉండాలని తపన పడే మహేష్ బాబు ఎప్పుడూ అద్భుతమైన కాన్సెప్టును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి మహేష్ 27, 28 వ చిత్రాల విషయమై చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

మహేష్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నాడనేది తెలియాల్సి ఉంది. అసలు విషయం ఏంటి అన్నది తెలియాలంటే సూపర్ స్టార్ అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే. మహేష్ లాంటి అందమైన, ప్రతిభావంతుడైన, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోతో పని చేయాలని ఏ దర్శకుడు కోరుకోడు?

ప్రతి దర్శకుడూ అతడితో ఒక్క సినిమా అయినా చేయాలి అని ఆశిస్తారనడంలో సందేహం లేదు. మహేష్ తో ఆ ఒక్క ఛాన్స్ ఎప్పుడెప్పుడా అని దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా దర్శకులు చాలామంది తమ ప్రయత్నాల్లో తాము ఉంటారు. అభిమానులకు కూడా మహేష్ కొత్త సినిమాలపై ఆసక్తి ఉంటుంది.

కొంతకాలంగా క్లాస్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తో ట్రెండ్‌ మారుస్తూ కామెడీతో పాటు మాస్‌ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఇక మహేష్ తదుపరి సినిమా ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share

Leave a Comment