అందరికీ గుర్తుండిపోయేలా

భరత్ అనే నేను సినిమా తో బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మన ముందుకు రానున్న ఈ సినిమా మహేష్ బాబు కరియర్ లో 25వ సినిమా గా తెరకెక్కనుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ విలేజ్ సెట్‌లో  పూర్తి చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో సాగే సన్నివేశాలను ఈ సెట్‌లో చిత్రీకరించినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఈ షెడ్యూల్ ఆదివారం తో పూర్తి అయింది. ఈ చిత్రానికి సంబంధించిన తర్వాత షెడ్యూల్ జనవరి నుంచి మొదలు కానుంది.

ఇక తదుపరి షెడ్యూల్ చిత్రబృందం తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ మొదలు పెట్టనుంది. మహర్షి విశేషాలేమీ బయటకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా నెలలుగా నిర్మాణంలో వున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్‌ వివిధ దశల్లో మనిషి జీవితాన్ని ప్రతిబింబించే పాత్ర పోషిస్తున్నాడు.

సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నారు. మహేష్‌ కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపించే ఎపిసోడ్‌ చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రంలో ఇంటర్వెల్‌ బ్లాక్‌ మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందట. ఈ చిత్రానికి ఇంటర్వెల్‌ టైమ్‌కి బ్లాక్‌బస్టర్‌ రిపోర్ట్‌ వస్తుందని యూనిట్‌ గట్టి నమ్మకంతో వున్నారట.

ప్రతి ఒక్కరి కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. అలా నిలబడ్డప్పుడే… రియల్‌ లైఫ్‌లో అయినా, రీల్‌ లైఫ్‌లో అయినా వారిని హీరో అంటారు. మహేష్‌ అలానే నిలదొక్కుకున్నాడు. కిందపడిన ప్రతిసారీ మరింత పైకి లేచాడు. అంతకంతకూ ఎదిదుగుతూ నంబర్ వన్ స్థానం లో హుందాగా కూర్చున్నాడు.

వంశీ పైడిపల్లి రెగ్యులర్‌ స్టార్‌ హీరో సినిమాలా కాకుండా ఈ చిత్రాన్ని చాలా సెన్సిబుల్‌గా తీర్చిదిద్దుతున్నాడట. మహేష్‌ కెరియర్లో గుర్తుండిపోయే సినిమాగా మహర్షి నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే వేసవిలో మొదట వచ్చే భారీ చిత్రం ఇదే కనుక ఓపెనింగ్స్‌ పరంగా సంచలనాలు ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చు.

ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ గారు మహర్షి గురించి కొన్ని ఆశక్తికర విషయాలను వెల్లడించారు. “ఊపిరి కన్నా రెండింతల ఇంపాక్ట్ ఉంటుంది మహర్షిలో. ఎలా చెప్పాలంటే ఫ్యాన్స్ కంటే మేము చాలా ఎదురుచూస్తున్నాం, ఎపుడెప్పుడు మహర్షిని స్క్రీన్ మీద చూస్తామా అని. సినిమాలో భాగమైన మేమే అంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు.

మాస్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ అందరూ మెచ్చేలా అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయని యూనిట్ నమ్మకంతో ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. అసలే ఈ చిత్రం సూపర్‌స్టార్ 25 వ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు. మ‌రి ఇప్ప‌టికే ఏప్రిల్‌లో రెండు సార్లు కెరీర్ బెస్ట్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్‌ను సాధించిన మహేష్ బాబు … ‘మ‌హ‌ర్షి’తో హ్యాట్రిక్ కొడ‌తారేమో చూడాలి. కచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడు అనే అందరూ విశ్వసిస్తున్నారు.

Share

Leave a Comment