వన్ ఆఫ్ ఇట్స్ కైండ్

మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు, అయన నటనకు ఆయనే మైలురాళ్ళు పెట్టుకుంటూ వాటిని ఆయనే అధిగమిస్తూ వచ్చారు. కొన్ని పాత్రలు ఇతని కోసమే రాస్తారేమో అన్నట్టు నటిస్తారు. కథలో ఉన్న ఇంటెన్సిటీ ని చివరి వరకు అయన నటనతో ఎక్కడ మిస్ అవ్వకుండా చేస్తారు.

1 నేనొక్కడినే లాంటి కథ విషయంలో సుకుమార్ వినూత్న పాయింట్ ని ఎంచుకున్నాడు. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన వైనం తెలుగు తెర మీద అద్భుతంగా ఆవిష్కరించడంలో విజయం సాదించారు. ఈ సినిమా మీద విశ్లేషన మరియు అంతర్లీనంగా ఎంత గొప్పగా చిత్రీకరించారో తెలియజేసే విశేషాలు మీకోసం.

– కన్సర్ట్ లో ఫైరింగ్..వైట్ నో… : ఈ సన్నివేశం తెలివైన స్క్రీన్ ప్లేకి ఒక మంచి ఉదాహరణ. ఇంట్రడక్షన్ సాంగ్ అయ్యాక గౌతం ని నిజంగా ఆంటోనియో కాల్చినట్టు చూపిస్తారు. కాని ఈ ఫైరింగ్ కేవలం గౌతం ఒక్కడే గమనించడం మరియూ కన్సర్ట్ లో అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరూ స్పందించకుండా నార్మల్ గా ఎంజాయ్ చేస్తునట్టు గా చుపించడం ద్వార అది కేవలం గౌతం ఊహ అని అర్ధం అయ్యేలా చిత్రీకరించారు.

– కార్ వచ్చిందని ఊహించుకోవడం: కంసర్ట్ ఎరీనా నుండి బయటకి వచ్చిన వెంటనే, గౌతం కి బి.యెం.డబ్ల్యూ కారు ఉన్న హోర్డింగ్ కనపడుతుంది. అలా చూసిన కారు తన ఊహల్లో నుండి నిజంగా బయటకి వచ్చి తనని చంపడానికి దానిని ఆ పోని టైల్ డ్రైవింగ్ చేస్తున్నాడు అని ఊహించుకుంటాడు.

– టన్నల్ లో లైట్స్ వెలగడం : టన్నల్ లో లైట్స్ వెహికల్స్ వెళ్తే ఆటోమేటిక్ గా వెలుగుతాయి సెన్సార్స్ ఉండటం వల్ల.. ఆ టన్నల్ లైట్స్ గౌతం బైక్ మీద వెళ్తుంటే వెలుగుతాయి కాని ఆంటోనియో కారు వెళ్తే మాత్రం వెలగవు. ఇక్కడే దర్శకుదు చాల తెలివిగా మనకి ఆ కారు గౌతం ఊహించుకున్నడు అంతే అని హింట్ ఇచ్చాడు.

– వాటర్ స్ప్లాష్ : గౌతం తన బైక్ మీద ఆంటోనియో (పోని టైల్) కారు ని చేజ్ చేస్తున్నప్పుడు, తన బైక్ మరియు ఆంటొనియో కారు రెండూ వాటర్ ఉన్న పాట్ హోల్ మీద నుండి వెళ్తాయి. తన బైక్ వెళ్ళినప్పుడు ఆ వాటర్ స్ప్లాష్ అవుతాయి కాని ఆంటోనియో కారు వెళ్ళీనప్పుడు మాత్రం యెలాంటి స్ప్లాష్ చూపించకపోవడం దర్శకుడి తెలివిని తెలియజేస్తున్నాయి.

– బాటిల్ మీద రక్తపు మరకలు లేకపోవడం: ఆంటోనియో ని పొడిచిన తర్వాత గౌతం పోలిస్ స్టేషన్ కి తను చంపడానికి ఉపయోగించిన బాటిల్ తో సహా వచ్చి లొంగిపోతాడు. కాని ఆ బాటిల్ మీద ఎటువంటి రక్తపు మరకలు ఉండవు. ఇక్కడ సుకుమార్ మనల్ని తన ప్రతిభ తో మనల్ని మాయ చేయడానికి వర్షం పడుతున్నప్పుడు మహేష్ స్టేషన్ కి వచ్చినట్టు చూపించాడు.

– ఇంటర్వెల్ ఇల్యూషన్ – సౌండ్ రాకూడదే : ఇది సినిమాలో చాల కీలకమైన సన్నివేశం. ఇక్కడ కూడా దర్శకుడు మనల్ని కంఫ్యూస్ చేయడానికి సతవిధాల ప్రయత్నించాడు. ఆంటొనియో నిజంగా వచ్చిన మహేష్ కేవలం తనని ఊహించుకున్నట్టు తన ఊహ లో నుండి వచ్చిన అతన్ని మహేష్ చంపేసినట్టు చూపించడం సినిమా కి పెద్ద హైలైట్ గా నిలిచింది. ఇటువంటి ఇంటర్వెల్ బాంగ్ తెలుగు లో ఎప్పుడు చూడలేదు.

– ప్రేమ కన్నా భయం గొప్పది : మనలో చాలా మందికి ఈ డౌట్ వస్తుంది, ఎలా గౌతం తన పేరేంట్స్ మొహాలని మర్చిపోతాడు కాని విలన్స్ ని గుర్తుంచుకుంటాడు అని, దానికి ఈ ఒక్క సీన్ ఉదాహరన .. తన చిన్నతనం నుండి తనని చావు వెంటాడం వలన తనకి భయం వలన ఆ విలన్స్ ఫేస్ మాత్రమే గుర్తుండి తన సొంత వాల్ల మొహాలు మర్చిపోతాడు అని చక్కగా జస్టిఫై చేసాడు.

– రూబిక్స్ క్యూబ్ ప్యాటర్న్ : సినిమా మొత్తం లో ఎక్కడా కూడా గౌతం రూబిక్స్ క్యూబ్ ని కరెక్ట్ గా సాల్వ్ చేసినట్టు చూపించలేదు. తను ఒక పర్టిక్యులర్ కాంబినేషన్ వచ్చాక ఆపేయడం చూపించాడు. సినిమా లో ఆ రూబిక్స్ క్యూబ్ ప్యాటర్న్ ఆధారంగా సీక్రెట్ ఇంఫర్మేషన్ ని హైడ్ చేస్తారు. ఇక్కడ ఒక డౌట్ వస్టుంది, ఇన్ని సంవత్సరాలూ ఎవరూ సాల్వ్ చేయలేరా అని, అందుకే తెలివిగా సుకుమార్ గౌతం చేత సినిమ మొత్తం ఒక ప్యాటర్న్ లో సాల్వ్ చేయడం చూపించాడు కాని కరెక్ట్ గ సాల్వ్ చేస్తున్నట్టు ఎక్కడా చూపించలేదు.

Share

Leave a Comment