మెస్మరైజ్ చేస్తున్న మహేష్

భరత్ అనే నేను సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించారు. ఈ హిట్ ఇచ్చిన జోష్ తో తన 25వ సినిమా చేస్తున్న మహేష్, మేక్ఓవర్ తో సర్‌ప్రైజ్ చేశారు. ఎయిర్ పోర్ట్ దగ్గర లీక్ అయిన ఫోటోస్ తో మహేష్ ఎలా ఉండబోతున్నారు అనేది తెలిసినా క్యాప్ పెట్టుకొని ఉండడంతో లుక్ పై పూర్తి క్లారిటీ రాలేదు.

మహేష్‌ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తాజాగా మూవీ ఆర్టిస్ట్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సరికొత్త లుక్‌తో సర్‌ప్రైజ్ చేశారు. అక్కడి నుండి ఇక సుధీర్ బాబు సమ్మోహనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై అభిమానుల్లో సంతోషాన్ని నింపారు. 

ముఖ్యంగా మహేష్ లుక్ సూపర్ గా ఉంది. మీసకట్టులో మహేష్ మరింత అందంగా కనిపించారు. గడ్డాన్ని అందంగా ట్రిమ్ చేసి, కొత్త హెయిర్ స్టయిల్ల్లో మహేష్ కనిపించారు. సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన మహేష్ ని చుసిన వాళ్ళు తన కొత్త లుక్ ని చూసి ఫిదా అవుతున్నారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లుక్ తోనే మహేష్ నెక్స్ట్ సినిమాలో కనిపించనున్నారు. సినిమాల పరంగా ప్రయోగాలు చేసే మహేష్ తాజాగా తన 25వ సినిమాకి ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈనెల 17 వ తేదీన డెహ్రాడూన్ లో షూటింగ్ ప్రారంభంకానుంది.

కొత్త లుక్‌లో మహేష్ కేక పుట్టిస్తున్నారంటూ అన్ని వర్గాల నుండి కామెంట్లు పడుతున్నాయి. సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది, మరి సినిమా కూడా ఇంకెంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందో అని అభిమానులందరూ చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్‌గా కనిపిస్తారని సమాచారం. ఆ పోర్షన్‌ కోసమే మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించనున్నారు అని వినికిడి. అయితే ఈ వార్తలు నిజమో కాదో తేలాలంటే అధికారిక ప్రకటన వెలువడే దాకా వేచి చూడాల్సిందే.

Share

Leave a Comment