అందరూ ఫిదా అవుతున్నారు

మహేష్ బాబు తాజా సినిమా కోసం గడ్డం, మీసం పెంచేశారు. ఈ లుక్‌లో సూపర్ స్టార్ అదుర్స్ అనేలా వున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ గడ్డం, మీసంతో కనిపిస్తారని టాక్ వచ్చింది.

విదేశాల నుంచి వస్తూ ముంబై లో తన కొత్త లుక్ ని కొంచెం పరిచయం చేశారు మహేష్. దింతో అభిమానులంతా మహేష్ ను కొత్త లుక్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రుతతో వెయిట్ చేసారు. ఇందుకు తగినట్లు మహేష్ ఆదివారం కొత్త లుక్‌తో దర్శనమిచ్చారు.

డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ డబ్బింగ్ ఆర్టిస్టులను అభినందించారు. డబ్బింగ్ వల్లే సినిమా స్థాయి పెరుగుతుందని మహేష్ తెలిపారు. డబ్బింగే సినిమాకి ప్రాణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మహేష్ కొత్త లుక్‌లో కన్పించారు. గడ్డం మీసంలో కన్పించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. ఒక్కసారిగా స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులంతా మహేష్ నే చూస్తూ ఉండిపోయారు. కొత్తలుక్‌లో మహేష్ అదిరిపోయారు అంటూ కితాబిచ్చారు.

ఈ సందర్భంగా తీసిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ లుక్‌‌లో మహేష్‌ను చూసిన ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. తన అభిమాన హీరో ఇలాంటి లుక్‌లో కనిపించడం హ్యాపీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు, లైకులు, షేర్లు చేస్తున్నారు.

కొత్త లుక్‌లో మహేష్ కేక పుట్టిస్తున్నారంటూ కామెంట్లు పడుతున్నాయి. సూపర్ స్టార్ అభిమానులైతే ఆనాటి కృష్ణుడిని మళ్లీ చూస్తున్నామంటున్నారు. ఇక మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
మహేష్ లుక్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. ఇక పోతే ఈ కొత్తలుక్ మహేష్ 25 చిత్రం కోసమే.

అలాగే సమ్మోహనం ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ మహేష్ బాబు ఇదే లుక్‌లో కనిపించాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇంద్రగంటి తీసిన ‘అష్టా చమ్మా’, ‘జెంటిల్‌మన్‌’ చూశా. ‘అష్టా చమ్మా’ నా ఫేవరేట్‌ ఫిల్మ్‌. ‘భరత్‌ అనే నేను’ తర్వాత అభిమానులను కలవడం ఇదే. మీ అశీసులు, అభిమానం ఇలాగే ఉండాలి. సుధీర్‌ సినిమాని పెద్ద హిట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు.

కాగా మహేష్ బాబు 25 చిత్రాన్ని వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ బాణీలందిస్తున్నారు. జూన్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.

Share

Leave a Comment