ఆసక్తిగా ఎదురు చూస్తున్న

వంశీ పైడిపల్లీ దర్శకత్వంలో తెరకెక్కతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ఈమధ్యనే అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 5, తరవాత రోజు ఉగాది పండుగా కావడం కాబట్టి వరుసగా సెలవులు కావడంతో ఇదే మంచి సమయం గా చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

పూజాహెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రం ఫిబ్రవరి ఆఖరికి షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి స్వరాలు అందిస్తున్నారు. కాగా దిల్ రాజు తో అశ్వినిదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం డెహ్రూడూన్ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త లుక్ లో సూపర్ స్టార్ ని చూడడానికి ఫ్యాన్స్ చాలా రోజులనుంచి వేచి చూస్తున్నారు. ఫంక్షన్లలో, లీక్ ఫొటోల్లో మహేష్ ని చూసినా కూడా ఫస్ట్ లుక్ లో చూస్తే ఆ కిక్కే వేరు. అందుకే మహేష్ పుట్టిన రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అప్పట్లో మన స్టార్ హీరోలు 100, 200 వందల సినిమాలు చేసారు. వాళ్లకు వందో సినిమా, రెండు వందల సినిమా అంటే ప్రత్యేకంగా ఉండేవి. ఇప్పుడున్న స్టార్ హీరోలు యాభై సినిమాలు చేయడం గగనం. అందుకే వాళ్లకు 25 వ సినిమా అంటే ప్రత్యేకమని చెప్పాలి.

అందుకే 25వ సినిమా అనేది చాలా స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇప్పటికే మహేష్ 25వ చిత్రం మీద ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కనక హైప్ భీభత్సంగా ఉంది. ఆ అంచనాలను అందుకొనేలా ఫస్ట్ లుక్ ఉండాలని ఫ్యాన్స్ ఆకాంక్ష.

‘మహేష్‌25’ చిత్రం ఏ రేంజ్‌ రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. సినిమా స్టార్ట్ చేసిన 15 రోజుల్లోనే విడుదల డేట్ ను ప్రకటించడం విశేషం. అంటే సుమారు తొమ్మిది నెలల్లో సినిమా విడుదలకు రెడీ అవుతుందన్నమాట. అయితే ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు చేయలేదు.

Share

Leave a Comment