పండుగ ముందే మొదలవనుంది

ప్రిన్స్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో రూపొందుతున్న సినిమా విడుదల తేదీ గురించి అఫీషియల్ గా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. నిర్మాతలు ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ లాక్ చేసినట్టుగా నిన్న సామజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.

అసలే మహేష్ 25వ సినిమా. సెంటిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా దీన్ని ల్యాండ్ మార్క్ మూవీగా మలిచే ప్రయత్నంలో డెడ్ లైన్ పెట్టుకుని తొందరపడకుండా నెమ్మదిగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారట. సో మహేష్ ఫాన్స్ కి వచ్చే సమ్మర్ లో పండగ మొదలవబోతుంది.

ఏప్రిల్ 5 కు మరో విశేషం ఉంది. ఉగాది పర్వదినం ముందు రోజు అది. అంటే ఒక రోజు ముందే అభిమానులకు పండగ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట.

పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని అందుకే కాలేజీ ఎపిసోడ్ మహేష్ ఫ్రెండుగా ‘రవి’ అనే పాత్రలో నటిస్తున్నారు అని సమాచారం. అల్లరి నరేష్‌ మొట్ట మొదటి సారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటిస్తున్న విషయం తెలిసిందే.

భరత్ అనే నేను తర్వాత దేవి శ్రీ ప్రసాద్ మరోసారి మహేష్ కు స్వరాలు సమకూరుస్తున్నాడు. రెండు భారీ నిర్మాణ సంస్థల కాంబో కాబట్టి ప్రొడక్షన్ గురించి చెప్పాల్సిన పని ఉండదు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అభిమానుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు చేయలేదు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. సినిమా స్టార్ట్ చేసిన 15 రోజుల్లోనే విడుదల డేట్ ను ప్రకటించడం విశేషం. అంటే సుమారు తొమ్మిది నెలల్లో సినిమా విడుదలకు రెడీ అవుతుందన్నమాట.

Share

Leave a Comment