మ‌హేష్ బ్రిలియంట్ అంటున్న విజయ్

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్ హీరోలకు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ అందరికీ సుపరిచితుడే. టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలందరితోనూ పని చేసిన అనుభవం ఆయన సొంతం.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో ‘దూకుడు ‘ సినిమాకి పని చేసి ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు ఫైట్ మాస్టర్ విజయ్. తరువాత మ‌హేష్ బాబు తో ‘బిజినెస్ మ్యాన్, ఆగడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ చిత్రాలకు కలిసి పనిచేశారు విజయ్ మాస్టర్.

తాజాగా మ‌హేష్ బాబు తో తనకు ఉన్న వర్క్ ఎక్స్పీరీయన్స్ గురించి ఒక ఇంటర్వూలో పంచుకున్నారు ఫైట్ మాస్టర్ విజయ్. ఆ విశేషాలు మీ అందరి కోసం. మ‌హేష్ బాబు గారి గురించి చెప్పమని అడగగా ఆయన ఇలా చెప్పుకొచ్చారు.

‘మ‌హేష్ ఎప్పుడూ ఏమీ చెప్పరండి. మాస్టర్ బావుండాలి మాస్టర్ అంటారు అంతే. ఏది చెప్పినా గాని చేస్తారు’ అని అన్నారు ఫైట్ మాస్టర్ విజయ్. మ‌హేష్ బాబు గారు అలా నిల్చున్నా కూడా ఒక ఫైటే అనుకుంటారు ఆయన అభిమానులు అని వ్యాఖ్యాత అనగా దానికి విజయ్ మాస్టర్ ఇలా జవాబిచ్చారు.

‘బ్రిలియంట్ ఆయన. అంటే ప్రతీది కూడా తెలుసు ఆయన. కానీ తెలియనట్లే ఉంటారు ఆయన స్పాట్ లో. టెక్నికల్గా తెలుసు. అన్ని విధాలా తెలుసు ఆయనకు. కానీ ఏమీ తెలెయనట్లు చాలా ప్లెసెంట్‌గా ఉంటారు ఆయన. ఆయన తో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. చాలా హ్యాపీగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు ఫైట్ మాస్టర్ విజయ్.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్రస్తుతం త‌న 25వ చిత్రంగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీ చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కొన్ని రోజులుగా డెహ్ర‌డూన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. 24 రోజుల పాటు జ‌రిగిన షెడ్యూల్ పూర్తైంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.

పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌5 ,2019న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Share

Leave a Comment