ఈ క్యూట్ ఫోటో ని చూశారా?

‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు.

న్యూఇయర్ కోసం మహేష్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్ళి వచ్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం భరత్ అనే నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్.

విదేశాల్లో గడిపిన సంగతులను ఎప్పటికప్పుడు మహేష్ సతీమణి నమ్రత సోషల్‌మీడియా లో షేర్ చేస్తునే ఉన్నారు.

మొన్నటికి మొన్న మహేష్ గాల్లో తేలిపోతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్న నమ్రత.. తాజాగా మరో అద్భుతమైన ఫొటోను షేర్ చేశారు.

తమ పిల్లలు గౌతమ్, సితార కలిసున్న ఫొటోను నమ్రత షేర్ చేశారు. అన్నాచెల్లెలు మధ్య అన్యోన్యతను తెలియజేస్తూ ‘లవ్’ అని రాశారు.

గౌతమ్ బుగ్గపై సితార ప్రేమతో ముద్దు పెడుతున్న ఈ ఫొటో చూసి మహేష్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఘట్టమనేని వారసుల అన్యోన్యతను కీర్తిస్తున్నారు.

మహేష్ బాబు కూతురు సితారకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ ఫొటో కనిపించినా.. వీడియో కనిపించినా అవి వైరల్ అయిపోతాయి.

నమ్రత, తాజాగా గౌతమ్, సితార కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో దానికి నెటిజన్ల నుంచి కామెంట్స్, లైక్స్ వెల్లువలా వస్తున్నాయి.

పిల్లలు గౌతమ్, సితారలతో వెళ్ళిన ఫ్యామిలీ ట్రిప్ లు తదితర ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లో ఉంచుతుంది నమ్రత.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులు ఈ ఫొటోతో ఖుషీ అయ్యారని చెప్పొచ్చు. ఈ ఫొటోను అభిమానులు షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం మహేష్ చేస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా 2018 లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Share

Leave a Comment