పాదరసంలా మహేష్..

తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఎర్పరుచుకున్న డైరెక్టర్స్ లో ఈయన ఒకరు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించిన డైరెక్టర్ హరీష్ శంకర్. తరువాత దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా మరో పెద్ద సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు హరీష్‌ శంకర్‌. మహేష్ బాబు తో సినిమా చేస్టారా అన్న ప్రశ్నకు ఆయన చాన్స్ ఇస్తే ఇందుకు చేయను. పోకిరి, బిజినెస్ మేన్ సినిమాల్లో మహేష్ నటనలో పూరి జగన్నాథ్ బాడీ లాంగ్వేజ్ & టైమింగ్ కనిపిస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో శ్రీకాంత్ అడ్డాల స్టయిల్ కనిపిస్తుంది. దూకుడులో శ్రీను వైట్ల టైమింగ్ కనపడుతుంది. కొరటాల శివ సినిమాల్లో సటిల్డ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. వంశీ పైడిపల్లి స్టైల్ లో
ఇంకా రీసెంట్ గా అనిల్ రావిపుడి కి తగ్గట్టు గా కనిపించారు.

ఏ డైరెక్టర్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ స్టయిల్ ని మహేష్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. ఈ విషయంలో ఆయనను పాదరసం అనేయొచ్చు. దర్శకుడు ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. మహేష్ బాబు గారు కంప్లీట్ గా డైరక్టర్స్ యాక్టర్ అని ప్రతీ దర్శకుడు చెప్పే మాటే.

మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ ఇట్. ఒక పోకిరి లాంటి సినిమా చేయాలి ఆయనతో. ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీయాలి ఆయనతో. కామెడీ ఫుల్ గా ఉండాలి. ఆయన ఎంటర్‌టైన్ చేస్తే ఇక షేక్ అయిపోతది బాక్సాఫీస్.

మహేష్ ను తనకు అలవాటైన ఒక డిఫరెంట్ స్టైల్ లో చూపించాలని అనుకుంటున్నాను అలాంటి సినిమా చేయాలి ఆయనతో. అలాంటి కధలు కూడా ఉన్నాయి ఆయన కోసం నా దగ్గర అని చెప్పారు హరీష్ శంకర్. మహేష్ పైన తనకు ఉన్న అభిమానాన్ని ఆయన ఇది వరకు కూడా వెలిబుచ్చారు.

దూకుడు చిత్రంలో టైటిల్ సాంగ్ లోని పాదరస ఒరవడి నరనరమే అనే వాక్యం మహేష్ కు సరిగ్గా సరిపోతుంది. హరీష్ శంకర్ బాడీ లాంగ్వేజ్ లో కూడా మహేష్ ను ఓ సినిమాలో చూడాలని అనుకుంటున్నా అంటూ నవ్వేసారు.

మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పరుశురాం సినిమా సరికొత్త కధతో మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయని పరశురామ్ చెప్పారు. ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నానని తెలిపారు. ఇది మంచి సబ్జెక్ట్ అని చాలా మంచి సినిమా అవుతుందని నవరసాలు ఉంటాయని వివరించారు.

Share

Leave a Comment