సూపర్‌ స్టార్‌ అంటే స్టార్‌డమ్‌ మాత్రమే కాదు

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన యంగ్‌ హీరో కార్తికేయ, సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి కార్తీకేయ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీపావళి కానుకగా విడుదలైన విజయ్‌, మురుగదాస్‌ల సర్కార్‌ సినిమాపై మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సర్కార్‌ బాగుందంటూ మహేష్‌ చేసిన ట్వీట్‌కు మురుగదాస్‌ రిప్లై కూడా ఇచ్చాడు.

తాజాగా ఈ ట్వీట్‌ పై స్పందించిన కార్తికేయ ‘సూపర్‌స్టార్‌ గా ఉండటం అంటే స్టార్‌డమ్ మాత్రమే కాదు. మహేష్ సర్‌ లాంటి వారు చూపించే యాటిట్యూడ్‌ అది. స్పైడర్‌ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా మురుగదాస్‌ గారి పట్ల మహేష్ గారి గౌరవం అలాగే ఉంది. అంతేకాదు సాటి హీరో సినిమాను పొగుడుతూ ఇలా ప్రచారం కల్పించటం కూడా మహేష్ లోని ప్రత్యేకత’ అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ.

‘సర్కార్’ సినిమా సూపర్‌గా ఉందని తెలుపుతూ, పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా చూసి తాను బాగా ఎంజాయ్ చేశానని, ఇందులో మురుగదాస్ ట్రేడ్ మార్క్ స్పష్టంగా కనిపించిందని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు మహేష్ బాబు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు మహేష్.

మహేష్ తో స్పైడర్ తీసి నిరాశ పరిచినా, మహేష్ కొత్త సినిమా భరత్ అనే నేను గురించి మురుగుదాస్‌ ఎక్కడా స్పందించకపోయినా కూడా మహేష్ ఈ సినిమా ని అభినందించి తాను ట్రూ జెంటిల్మాన్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇదే ట్వీట్ ని తనా ఖాతా నుండి షేర్ చేసి మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తాడు కార్తికేయ.

లాంటి సమయంలో ట్వీట్ చేసి తాను ఈగో లెస్ సూపర్ స్టార్ ని అని మరో సారి ఋజువు చేసుకున్నారు మహేష్ బాబు. ఇటీవలే ‘ఆర్‌ఎక్స్100’ రూపంలో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న కార్తికేయ తాజాగా ‘హిప్పీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ ‘మహర్షి’. ఈ మూవీ కోసం యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న విడుదల కానుంది.

Share

Leave a Comment