మహేష్ ట్వీట్‌కి కార్తికేయ ప్రశంసల వర్షం

మ‌న‌సులో ఏమీ పెట్టుకోకుండా ఇతరులని స్వచ్చంగా అభినందించడం చాలా గొప్ప విషయం. అందులోను సినిమా ఇండస్ట్రీ లో ఈగో చాలా కామన్. ఒక దర్శకుడు ఫ్లాప్ ఇస్తే తిరిగి అతని వంక చూడరు కొంత మంది హీరో లు. కాని సూపర్‌స్టార్ మహేష్ బాబు తానెంత స్పెషల్ అనేది మరోసారి అందరికీ తెలియజేసారు. ఈ మ‌ధ్య చాలా సినిమాల‌కు మ‌హేష్ ట్వీట్ చేసాడు. ఇప్పుడు “స‌ర్కార్” కూడా..!

అందులో గొప్ప ఏంటా అనుకుంటున్నారా? అవును, ఆ సినిమా మురుగదాస్ ది కావడం విసేషం. మహేష్ తో స్పైడర్ తీసి నిరాశ పరిచినా, మహేష్ కొత్త సినిమా భరత్ అనే నేను గురించి మురుగుదాశ్ ఎక్కడా స్పందించకపోయినా కూడా మహేష్ ఈ సినిమా ని అభినందించి తాను ట్రూ జెంటిల్మాన్ అని నిరూపించుకున్నడు.

ఇప్పుడు ఇదే ట్వీట్ ని తనా ఖాతా నుండి షేర్ చేసి మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తాడు ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ. సూపర్‌స్టార్ అని పిలిపించుకోడం అంటే కేవలం స్టార్డమ్ ఒక్కటే సరిపోదు, ఇలా మహేష్ బాబు గారి లాంటి యాటిట్యూడ్ ఉండాలి. అప్పుడే నిజంగ సూపర్‌స్టార్ అనిపించుకోడానికి అర్హులు అని మహేష్ ని ప్రశంసించాడు.

స్పైడర్ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా ప్రస్తుతం అదే ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన మ‌రో సినిమాను సూప‌ర్ స్టార్ చూసి ఇలా ట్వీట్ చేయ‌డం నిజంగా గొప్ప విష‌యం. సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా మహేష్ కి దర్శకుల మీద ఉన్న గౌరవం చాల గొప్పది అని, కేవలం గొప్పవారికే ఇలాంటి యాటిట్యూడ్ ఉంటుందని కార్తికేయ అభిప్రాయపడ్డాడు.

వెరే స్టార్ తో సినిమా తీసినా తనేమి నొచ్చుకోకుండా ఆ సినిమా ని ప్రమోట్ చేస్తున్న సూపర్‌స్టార్ చాల గ్రేట్ అని అందుకే ఆయన్ని తాను ఎంతగానో అభిమానిస్తాను, ఇన్‌స్పిరేషన్ గా తీసుకుంటా అని ట్వీట్ చేసాడు. ఓటు హ‌క్కు విలువ చెబుతూ మురుగ‌దాస్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా ప్ర‌మోట్ చేస్తుండ‌టంతో స‌ర్కార్ కి క్రేజ్ పెరిగింది.

దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్న ప్రాంతీయ భాష స్టార్ ఎవరైన ఉన్నారంటే అది కేవలం మన సూపర్ స్టార్ మహేష్ బాబు. నేషనల్ వైడ్ ఆయనికి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదు అనడంలో సందేహం లేదు. కొత్త రకమైన సినిమాలను ప్రశంసించడంలో ముందు వరుసలో ఉంటోన్న ప్రిన్స్, మంచి సినిమాలు చూసి వాటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Share

Leave a Comment