ఆ టాప్ 10 ఏమిటంటే..

హాలీవుడ్ కటౌట్ తో టాలీవుడ్ ను ఏలుతున్నాడు ఆ అతడు. అందం ఒక్కటే కాదు అంతకుమించి అభినయం అతడి సొంతం. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ మాత్రం చెక్కుచెదరదు. దీనికి ఒక కారణం లేకపోలేదు. ఎందుకంటే ఎప్పుడూ నిజాయితీగా ఉండటం మహేష్ కి అలవాటు.

ఒక్కడు నుండి పోకిరి వరకు, వన్ నుండి మహర్షి వరకు పాత్ బ్రేకింగ్ సినిమాలు ఎన్నో చేసినా తనకి ఆల్ ఇండియా వైడ్ గుర్తింపు వచ్చినా కించెత్తు గర్వం కూదా రాలేదు ఆయనికి. ఇప్పటికి తాను నమ్మే సింద్ధాంతాలు ఇవే అని ఇంటర్వ్యూలలో చెప్తూ వస్తున్నారు. ఆ టాప్ 10 ఏంటో మీరు కూడా చూసేయండి..

~ సినిమా రిజల్ట్ ని చాలా సీరియస్ గా తీసుకుంటాను. విజయం అయినా పరాజయం అయినా ఒకేలా తీసుకుంటా అని మాటవరసకు చెప్పే రకం కాదు.. పరాజయం కచ్చితంగా బాధిస్తుంది. ఒక సినిమా పరాజయం పాలయితే కేవలం డబ్బు ఒక్కటే నష్టపోడమే కాకుండా, అంతకుమించి ఆ సినిమా కోసం పని చేసిన అనేక మంది శ్రమ ని నేను వృధా చేసినట్టు.

~ ఏ హీరో అయినా ఎన్ని సంవత్సరాల నుండి యాక్టింగ్ చేస్తున్నా… సినిమా విడుదల ముందు నేను చాలా “కూల్” గా ఉంటాను అని చెప్తే కఛ్చితంగా అది అబద్దమే. పెద్ద స్టార్ అయినా చిన్న హీరో అయినా వారి సినిమా రిలీజ్ టైం లో చాలా టెన్షన్ పడతారు. నేను కూడా అంతే

~ బాలివుడ్ నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి కాని నాకు ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు ముఖ్యం. నాకు వీరెంతో చేసారు. నా మీద చూపిన ప్రేమాభిమానులకి వీరికి నేను చాలా రుణపడి ఉంటాను. నాకు వీరి అభిమానం చాలు. తెలుగు సినిమా స్థాయి ని మరింత పెంచాలని ఎల్లప్పుడూ శ్రమిస్తున్నాను.

~ పాలిటిక్స్ గురించి.. నేను యాక్టర్ ని.. నాకు పాలిటిక్స్ లో ఓనమాలు కూడా తెలీదు. అసలు అవి ఏ మాత్రం అర్థం కావు కూడా.. యాక్టింగ్ అనేది మై ఫస్ట్ అండ్ లాస్ట్ పాషన్..నాకు శక్తి ఉన్నంత వరకు యాక్టర్ గానే కొనసాగుతాను..

~ నా సతీమని నమ్రత నా బ్యాక్‌బోన్. చక్కగా నా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కేవలం ఆమెను అమితంగా ప్రేమించడమే కాకుండా చాలా విషయాలు ఆమే మీదే ఆధరపడతాను. నమ్రత పిల్లల విషయం లో బెస్ట్ మదర్. వాటినన్నింటిని ఆమే చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాండిల్ చేస్తుంది.

~ వయస్సు పెరిగేకొద్దీ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ చేయడం కష్టంగా మారతాయి. ఇది వరకు స్పందించినట్టు మన శరీరం సహకరించదు. డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడం మొదటి నుండి నాకు అలవాటు. ఇటీవల స్పైడర్ లో యాక్షన్ సీన్ జరుగుతున్నప్పుడు నా మోకాలికి గాయం అయింది.

~ బాహుబలి సినిమా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ నే చేంజ్ చేసేసింది. ప్రేక్షకులు టికెట్ కొనుక్కుని సినిమాలని చూస్తారు..సో ఆ డబ్బులకి వాల్లకి కావల్సినది చూపించాలి. బాహుబలి లాంటి సినిమాలు వారికి ఇంకా ఎక్కువ సంత్రుప్తినిస్తాయి. అంతే కాకుండా తెలుగు చిత్రాలకి ప్రపంచ స్థాయి గుర్తింపునిస్తాయి.

~ ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి మనం ఇండస్ట్రీలోకి వస్తే అది కేవలం మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది. సక్సెస్ కావడానికి ఇండస్ట్రీ లో కేవలం అదొక్కటే ఉంటే సరిపోదు. మన కృషి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఎవరైనా నిలబడగలరు.

~ బాక్స్ఆఫీస్ నంబర్స్ గురించి నేను ఎక్కువ పట్టించుకోను.. ప్రొడ్యూసర్స్ ఆండ్ డిస్ట్రిబ్యూటర్స్ చూసుకునే విషయాలు అవి. నా వరకు నా పాత్ర ని ఎంతా బాగా పోషించాననేది ముఖ్యం. ప్రతీ సినిమా నాకు మొదటి సినిమా లాంటిదే..నా 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

~ బాక్స్ఆఫీస్ నంబర్స్ గురించి నేను ఎక్కువ పట్టించుకోను.. ప్రొడ్యూసర్స్ ఆండ్ డిస్ట్రిబ్యూటర్స్ చూసుకునే విషయాలు అవి. నా వరకు నా పాత్ర ని ఎంతా బాగా పోషించాననేది ముఖ్యం. ప్రతీ సినిమా నాకు మొదటి సినిమా లాంటిదే..నా 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

తన సినిమా ఆడకపోతే తప్పంతా తన మీదే వేసుకుంటాడు.నిర్మొహమాటంగా జరిగిన పొరపాట్లను ఒప్పుకుంటాడు. సినిమా సక్సెస్ అయితే మాత్రం అది చిత్ర యూనిట్ మొత్తనికి చెందుతుంది అని చెప్పే గొప్ప మనసున్న మనిషి. తనలో కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు తానే తవ్వుకుని తనకుతానుగా నిలబబడే నిజమైన స్టార్.

Share

Leave a Comment