రికార్డు ధరకు

గత చిత్రం జయ అపజయాల తో సంబందం ఉండదు, కొత్త సినిమా ఆదాయానికి ఢోకా ఉండదు. ఇదే ఓ స్టార్‌ హీరో సినిమాకు తీసుకొచ్చే విలువ. ఓ అగ్ర నటుడు తన అభినయంతో కథను మరో స్థాయికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధమ స్థానం లో ఉంటారు.

రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతుండడంతో సినిమాకు సంబంధించిన ప్రతి మ్యాటర్ లో నిర్మాతలకి కాసుల పంట పండుతోంది. సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ ఉన్నా సరే షూటింగ్ దశలోనే మొత్తం థ్రియేటికల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ ఒప్పందాలు సెట్ అయిపోతున్నాయి.

అలాంటిది ఇక సినిమా బ్లాక్‌బస్టర్ అయితే దాని శాటిలైట్ రైట్స్ కి ఉండే క్రేజ్ గురించి చెప్పేదేముంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో మనకు తెలిసిన విషయమే.

సూపర్ స్టార్ మహేష్ అంటే నార్త్‌లో కూడా పిచ్చ క్రేజ్. అందుకే భరత్ అనే నేను హిందీ శాటిలైట్ రైట్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఏ తెలుగు సినిమాకి ఇవ్వని స్థాయిలో భారీ ధరను చెల్లించినట్లు సమాచారం. కనీవినీ ఎరుగని స్థాయిలో 22కోట్లు చెల్లించినట్లు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నేడు ప్రచురించింది.

బాహుబలి మినహా ఏ తెలుగు చిత్రానికి కూడా ఇంత ధర లభించలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మహేష్ హిందీలో ఎంత పాపులర్ అంటే ఆయన గత చిత్రాలన్నిటికి కూడా ఆ చానెల్స్‌లో మంచి టి.ఆర్.పి లను సొంతం చేసుకున్నాయి.

ప్రస్తుతం భరత్ అనే నేను జూన్ 9వ తేదీతో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఆ రోజున డిజిటల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అమేజాన్ ప్రైం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అమేజాన్ ప్రైం మెంబర్షిప్ ఉన్న వారంతా ఇంట్లోనే భరత్ అనే నేను ఫుల్ వర్షన్ మూవీ చేసేయొచ్చు. అన్నట్టు సినిమాలో కొన్ని కట్ చేసిన సీన్స్ కూడా అమేజాన్ ప్రైం లో ఉంచబడుతుంది.

మే 31న తమిళంలో భరత్ ఎన్నం నాన్ పేరుతొ విడుదలైన ఈ సినిమాకు అక్కడ తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొదటి రోజే భారీ వసూళ్లను అందుకుంది. కోలీవుడ్ లో మహేష్ అంటే మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా తమిళనాడు లో భారీగా విడుదలై రెండో రోజుకు థియేటర్స్ కూడా పెంచడం విశేషం.

Share

Leave a Comment