మ‌హేష్ అంటే చాలా ఇష్టం : రష్మిక

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఫ్యామిలీ పర్సన్ గా మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే.

ఆయన చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని అందరు ఇష్టపడతారు. చాలా మంది హీరోయిన్స్ కి మహేష్ తో కలిసి నటించాలని ఉంది అని ఇప్పటికే చాల సందర్భాలలో వెల్లడించారు.

ఇప్పుడు ఈ జాబితా లోకి రష్మిక మండన్న కూడా చేరింది. మహేష్ తో నటించాలని ఉంది అని తన కోరిక బయట పెట్టింది.

సాండల్ వుడ్ భామ రష్మిక మండన్న అంటే కన్నడ చిత్ర సీమ లో పేద్ద క్రేజ్ ..అతి తక్కువ సినిమాలతో అంత ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న నటీమనులలో రష్మిక ఒకరు.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి… ఆమె చేసిన కిరిక్ పార్టి కన్నడ లో ఘన విజయం సాధించింది. అంతే కాకుండా ఆ సినిమా తెలుగు లో రిమేక్ కూడా కాబోతుంది.

తెలుగు చిత్రం ‘చలో’ తో టాలివుడ్ లో అడుగు పెట్టబోతుంది రష్మిక. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చింది.

హైదరాబాద్‌ గురించి మాట్లాడుతూ…తనకి హైదరాబాద్ చాల నచ్చింది అని, ఇక్కడ హాస్పిటాలిటీ అద్భుతమని కొనియాడింది.

తెలుగు సినిమాలు ఎక్కువగా చూడలేదని కాని హీరోల్లో మహేష్ అంటే చాలా ఇష్టం అని ఆయనతో కలిసి నటించాలనుందని వెల్లడించింది..

గ్లామర్‌ పాత్రలే కాకుండా నటకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా..కథానాయికల్లో అయితే అనుష్కను ఎక్కువగా ఇష్టపడతాను అని తెలిపింది.

ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే.

మహేష్ అంటే తమకి ఇష్టం అని ఇప్పటికే పలు మార్లు అనేక ఇతర భాషా నటీమనులు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది.

మొన్నటికి మొన్న శ్ర‌ద్ధా క‌పూర్‌ మహేష్ తో కలిసి నటించడానికి తాను రేడి అని అని చెప్పింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి లేటెస్ట్ గ రష్మిక మండన్న ఎంట్రీ ఇచ్చింది.

ఆమె తెలుగు లోకి అడుగుపెడుతున్నందుకు బెస్ట్ విషెస్ తెలుపుతూ మరి మహేష్ తో నటించాలనే ఆమె కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.

Share

Leave a Comment